‘ఎన్టీఆర్’ నుంచి ‘ప్రకాష్ రాజ్’ వరకు శివుని పాత్రలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా ?

‘ఎన్టీఆర్’ నుంచి ‘ప్రకాష్ రాజ్’ వరకు శివుని పాత్రలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా ?

by Anudeep

Ads

సృష్టి లయకారుడు శివుడు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మన పెద్దలు. కోరిందే తడవుగా భక్తులకు వరాలు కురిపించి దైవం శివుడు.

Video Advertisement

మరి అలాంటి దైవం శివుడి మీద మన టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. శివుని పాత్ర ను అభిమానించే మన తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో శివుని పాత్రలో నటించి మెప్పించిన ఆ నటుడు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

#1. ఎన్టీఆర్ :

 

నందమూరి తారక రామారావు గారు పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. రాముడిగా కృష్ణుడిగా ఎన్నో సినిమాలు ఆయనతో రూపొందాయి. ఎన్టీఆర్ దక్షయజ్ఞం, ఉమా శంకర్ లో గౌరీ కథ లో శివుని పాత్రను పోషించారు.

#2. అక్కినేని నాగేశ్వరరావు :

ఏఎన్నార్ గారు శివుని పాత్రలో ఓ పౌరాణిక చిత్రం చేయలేదు. ఏఎన్నార్ నటించిన శివుని పాత్రలో కనిపించిన చిత్రం మూగ మనసులు. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా అనే పాటలో నాగేశ్వరరావు గారు 2,3 సన్నివేశాలలో శివుడిగా కనిపించారు.

#3. శోభన్ బాబు :

నటభూషణ శోభన్ బాబు గారు కూడా ఎన్టీఆర్ గారు కథనాయకుడిగా నటించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో పాత్రలు పోషించారు.

#4. కృష్ణంరాజు :

రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు వినాయక విజయం చిత్రంలో శివునిగా నటించి మెప్పించారు.

#5. బాలయ్య:

బాలయ్య గారు అత్యధిక చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. బాలయ్య గారు జగన్మాత, భక్త కన్నప్ప వంటి అనేక చిత్రాలలో శివుని పాత్రలు పోషించి మెప్పించారు.

#6. రామకృష్ణ :

ఎన్టీఆర్ గారు కథానాయకుడిగా నటించిన మాయామశ్చింద్ర చిత్రంలో రామకృష్ణ గారు శివుని పాత్రలో నటించారు.

#7. రంగనాథ్ :

కృష్ణ హీరోగా నటించిన ఏకలవ్యుడు కథ చిత్రం లో రంగనాథ్ గారు మహాశివుడు పాత్రలో నటించారు.

#8.చిరంజీవి:

చిరంజీవి ఆపద్బాంధవుడు చిత్రంలోని చిన్న సన్నివేశంలో శివుని గాను, అదేవిధంగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన మంజునాథ చిత్రంలో పూర్తి స్థాయిలో మహాశివుని గా నటించి మెప్పించారు.

#9. సుమన్ :

సుమన్ శ్రీ సత్యనారాయణ మహత్యం చిత్రంలో బ్రహ్మగా, విష్ణువుగా శివుడిగా మూడు పాత్రల్లో కనిపించి మెప్పించారు.

#10. రావు గోపాలరావు :

మా ఊరిలో మహాశివుడు చిత్రంలోని శివుని పాత్రను పోషించారు.

#11. రాజనాల :

రాజనాల గారు ఉషా పరిణయం చిత్రంలో శివుని పాత్ర పోషించారు.

#12. నాగభూషణం :

భూకైలాస్ చిత్రంలో శివుని పాత్రను పోషించారు.

#13. విజయ్ కాంత్ :

మన టాలీవుడ్ లో అడపాదడపా తెలుగు డబ్బింగ్ సినిమాల్లో కనిపించే హీరో విజయ్ కాంత్ గారు మధుర మీనాక్షి చిత్రంలో శివుని పాత్ర పోషించారు.

#14.  కమల్ హాసన్:

మన లోకనాయకుడు కమల్ హాసన్ నాగుల చవితి చిత్రంలో శివుని పాత్రలను పోషించి మెప్పించారు.

#15. ప్రకాష్ రాజ్ :

నాగార్జున హీరోగా నటించిన డమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్ శివుడిగా నటించారు.

Also Read: 

భారతీయ పురుషుల గురించి అందరూ ఇలాగే అనుకుంటారా..? ఇందులో ఎంతవరకు నిజం ఉంది..?


End of Article

You may also like