భారతీయ పురుషుల గురించి అందరూ ఇలాగే అనుకుంటారా..? ఇందులో ఎంతవరకు నిజం ఉంది..?

భారతీయ పురుషుల గురించి అందరూ ఇలాగే అనుకుంటారా..? ఇందులో ఎంతవరకు నిజం ఉంది..?

by Anudeep

Ads

ఇండియాలో మగవారు అంటే అదో రకమైన చులకన భావం ఉంటుంది. భావోద్వేగాలు లేని వారిగా, బాధ్యతలు పట్టించుకోని వారిగా, తల్లిదండ్రుల చాటు బిడ్డగా, డబ్బు సంపాదించడమే పరమావధిగా.. అన్నిటి కంటే ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి వెన్నెముక లేని వారిగా భావిస్తారు చాలా మంది.

Video Advertisement

వాస్తవంగా చూస్తే.. అది మన తప్పుడు భావనే కానీ అందులో నిజం లేదని అర్థమవుతుంది. పై వాటన్నింటిని ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం . .

#1 భావోద్వేగం:

సహజంగానే మగవారికి భావోద్వేగాలు తక్కువ అన్నట్టు చిత్రిస్తుంది సమాజం. పొరపాటున మగాడు ఏడిస్తే.. ఆడదానిలా ఏంటీ ఆ ఏడుపు అంటారు. అంటే.. ఏడవడం మగాడి లక్షణం కాదన్నట్టు.. నిజానికి ఆడవారి లాగే మగాళ్ళకి కూడా భయాలు, బాధలు, అభద్రత ఉంటాయి కానీ వాటిని లోపల దాచుకొని ధైర్యంగా ఉన్నట్టు నటిస్తారు.

#2 బాధ్యతలకు దూరంగా:

మగ వాళ్ళు పెళ్లికి ముందు పెద్దగా కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లికి ముందు యవ్వనాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అంత మాత్రాన పురుషులకు బాధ్యత తెలీదు అని కొట్టి పారేయనవసరం లేదు. ఓ దశలో వారికి బాధ్యతలు తెలిసొస్తాయి అనుకోవాలి.

#3 తల్లిదండ్రుల చాటు బిడ్డగా:

ఇంట్లో అడవాళ్ళతో పోలిస్తే మగ పిల్లలకు ఎప్పుడూ ప్రథమ స్థానమే. ఇది అబ్బాయిలకు ప్లస్ పాయింట్. కానీ అన్ని బంధాలను ఎలా హ్యాండిల్ చేయాలో ఆడ వాళ్లకు తెలిసినంతగా మగ వాళ్లకు తెలీదు. దీని వల్ల మగ వాళ్ళు బంధాలు నిలుపుకోడంలో కొంత వెనక పడ్డారనే చెప్పవచ్చు.

#4 డబ్బే పరమావధి :

ఒకప్పుడు డబ్బు సంపాదించడం పైనే మగ వారి దృష్టి ఉండేది కానీ రాను రాను మగ వారిలో మార్పు వచ్చింది. జీతం కంటే సంతృప్తే ముఖ్యం అని భావిస్తున్నారు. కొందరైతే కట్నాన్ని కూడా ఆశించట్లేదు. అత్తమామల నుంచి ఆశించడం మానేసి నేటి పురుషులు వారికి అవసరమైతే సహాయం చేస్తున్నారు.

#5 వెన్నెముక లేని వారిగా:

పురుషులు బయట ఎన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నా ఆడవాళ్ళ విషయంలో వెన్నెముక లేని వారిగా చూపబడతారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ఆడవారి విషయంలో మగ వారు ప్రేమ, ఆప్యాయత చూపించి మంచి అబ్బాయిగా ఉండాలి అనుకుంటారు. అలా ఉండడం వల్ల బంధాలు బలంగా ఉంటాయి.

bharatiya manushula jeevana vidanam

screenshot from : Moviebuff Tamil / YouTube

చిన్న పురుగొచ్చి పంటనంతా నాశనం చేసినట్టు.. కొంతమంది వికృత ప్రవర్తన వలన మగజాతి మొత్తం అనేక కారణాల వల్ల నిందించబడుతుంది.

Note: Images used in this post are for reference purposes only. They are not the actual characters.


End of Article

You may also like