ఎనర్జెటిక్ హీరో రామ్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారా?

ఎనర్జెటిక్ హీరో రామ్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారా?

by Anudeep

Ads

టాలీవుడ్ హీరో పోతినేని రామ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామ్ కు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా తన కాళ్లపై తాను నిలబడుతూ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్లాస్, మాస్ తేడా లేకుండా తనదైన శైలిలో యాక్టింగ్ లో ఇరగదీసేస్తూ దూసుకెళ్తున్నారు.

Video Advertisement

అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ టాలీవుడ్ లోకి 2006 లో “దేవ దాసు” సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అని. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరో రామ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఎనర్జెటిక్ హీరో రామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారట. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తన చిన్నప్పటి క్లాస్ మేట్ నే ప్రేమించిన రామ్ మొత్తానికి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో “వారియర్” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న రామ్ త్వరలోనే తన నిశ్చితార్ధానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ను కూడా ఇవ్వనున్నారట. వారియర్ సినిమా పూర్తవ్వగానే.. బోయపాటి డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి రామ్ కమిట్ అయ్యారు. అయితే.. ఈ క్రమంలో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై రామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


End of Article

You may also like