ఒక్క సినిమాను ప్రమోట్ చేయడానికి మల్లెమాల వారు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?

ఒక్క సినిమాను ప్రమోట్ చేయడానికి మల్లెమాల వారు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?

by Anudeep

Ads

ఒక సినిమా హిట్ అవ్వాలంటే  ప్రేక్షకుల ఆదరణ ఎంతో అవసరం. మరి ఆ సినిమాలు ప్రేక్షకులకు దగ్గర చేసేవి సినిమా ప్రమోషన్స్. అన్ని సినిమాలా కాకుండా తమ సినిమాలకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అంటూ కొత్త కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. ప్రేక్షకుల దృష్టిలోకి తమ సినిమాలను ఎలా తీసుకువెళ్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుందా అనే విషయం మీద  దృష్టి పెడతారు మన ఫిల్మ్ మేకర్స్.

Video Advertisement

తమ సినిమాల గురించి ప్రేక్షకులలో కి వెళ్లడానికి భారీ ఎత్తున ఖర్చు చేస్తూ నిర్మాతలు  ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా హీరో హీరోయిన్స్ తో అనేక కార్యక్రమలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. తమ సినిమా మీద ఆసక్తి పెంచుతుంటారు. అప్పుడే ప్రేక్షకులను సినిమా థియేటర్ల వరకు రాపించగలరు మూవీ మేకర్స్.

Jabrdhasth

ఇంట్లో ఉండే సినీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే బుల్లితెరని ఆశ్రయించాల్సిందే. మరి అధికంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించే షోలు ఏంటంటే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహించే జబర్దస్త్ షోకి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఈ షోలో మన జబర్దస్త్ కమెడియన్స్ సినిమా గురించి స్కీట్స్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. మరి ఈ విధంగా సినిమాను ప్రమోట్ చేయడానికి దర్శక నిర్మాతలు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారికి  దాదాపు 15 లక్షల వరకు చెల్లించుకుంటారు.

అదేవిధంగా సుమ యాంకర్ గా నిర్వహిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా  సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారికి 10 నుండి 15 లక్షల వరకు చెల్లించుకుంటారు. ఇలా సినిమాలను ప్రమోట్ చేయడం ద్వారా మంచి సంపాదనే వెనక వేసుకుంటుంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్.


End of Article

You may also like