Ads
భార్యభర్తల బంధం అనేది ఎంతో అద్భుతమైన వివాహ బంధం. కొందరు ప్రేమించినవారిని పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒకరైతే, మరీకొందరు పెద్దలు కుదిర్చిన వివాహబంధంతో ఒకటవుతారు. మొదటిలో భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి అవగాహన అనేది ఉండదు. నెమ్మది నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు నెలకొంటాయి.
Video Advertisement
చాలామందికి తన జీవిత భాగస్వామికి తనపై ప్రేమ ఉందో.. లేదో అని తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహపడుతుంటారు. అయితే మీ జీవితభాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే..
#1. మీపై శ్రద్ధ వహించడం :
మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ మీ జీవిత భాగస్వామి ఎంతో శ్రద్ధ వహిస్తారు. మీకు వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు చెప్పే ప్రతి మాటకు ప్రాముఖ్యతనిస్తారు. వారు మాటల్లో చెప్పకపోయిన వాళ్లు చేసే ప్రతి పనిలో మీపై ప్రేమ కనిపిస్తుంది.
#2. ప్రతి విషయాన్ని మీతో పంచుకోవడం :
మీ జీవిత భాగస్వామి మనసు లోపల ఉన్న రహస్యాలు కూడా మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు. చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయి అన్ని విషయాలు మీతో బహిరంగంగా చర్చిస్తారు. మీ మీద నిజమైన ప్రేమ ఉంటేనే తన రహస్యాలు కూడా మీతో పంచుకుంటారు.
#3. కళ్ళలోకి చూడడం :
మీ కళ్ళలోకి చూస్తూ ఈ లోకాన్నే మరిచిపోతారు. మీరు తప్ప మరొక విషయం వాళ్లకు గుర్తురాదు. మాటలతో మిమ్మల్ని ఆకర్షించుకోవాలని చూస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నా మీతో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు.
#4. మెచ్చుకోవడం ద్వారా :
మీరు చేసే ప్రతి పనిని మీ దగ్గర మరియు ఇతరుల దగ్గర ప్రశంసిస్తూ, గొప్పగా చెబుతారు. దీనిద్వారా వాళ్లకు మీ మీద ఎంత ప్రేమ ఉన్నది అని అర్థమవుతుంది.
#5. ఆరోగ్యంపై శ్రద్ధ:
మీకు చిన్న అనారోగ్యం చేసిన మీ జీవిత భాగస్వామి భరించలేరు. మీ దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఒక్క విషయం చాలు.. వాళ్లకు మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.
End of Article