Ads
రానా, సాయి పల్లవి ప్రధాన తారాగణంగా రొమాంటిక్ యాక్షన్ చిత్రం తెరకెక్కింది విరాట పర్వం. ఈ చిత్రానికిగాను వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నందితా దాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ జూన్ 17న విడుదలై బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయింది విరాటపర్వం చిత్రం. దీనితో విడుదలైన నెల రోజులకే థియేటర్లు ఖాళీగా మారిపోయాయి.
Video Advertisement
1990 కాలంలో విప్లవ భావాలపై ఆకర్షితురాలై నక్సల్ ఉద్యమంలో చేరిన తూము సరళ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి వెన్నెల క్యారెక్టర్ లో నటించారు. విమర్శకులు, ప్రేక్షకులు సైతం రానా మరియు సాయి పల్లవి నటన ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే డైరెక్టర్ సాయి పల్లవి కోసమే ఈ కథనం క్రియేట్ చేసినట్లు ఒకానొక సందర్భంలో వెల్లడించారు.
అయితే ఈ చిత్రానికి గాను హీరోగా ముందుగా గోపీచంద్ అని అనుకున్నారట దర్శకుడు. గోపీచంద్ కు ఈ కథ వినిపించగా ఈ చిత్రంలో ఎక్కువగా హీరోయిన్ కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందుకే ఈ చిత్రానికి నేను కరెక్ట్ కాదని నో చెప్పారట గోపీచంద్.
గోపీచంద్ నో చెప్పిన తర్వాత రానాను సంప్రదించి విరాటపర్వం చిత్రంలో నటింపజేసేశారు. గతంలో రానాకు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రంలో నటించవద్దని అభిమానులు కామెంట్స్ ద్వారా తెలియజేశారు. డిజాస్టర్ గా మిగిలిన ఈ చిత్రంలో గోపీచంద్ నటించినపోవడమే మంచిదని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ జులై 1న నెట్ఫ్లిక్స్ విడుదలయ్యింది విరాటపర్వం చిత్రం. థియేటర్లలో చూడలేకపోయాము అనుకునే ప్రేక్షకులు ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
End of Article