అత్తగారు ఆహ్వానించలేదు కానీ భర్త రమ్మంటున్నారు… నేనేం చేయాలి..? వెళ్తే అలా.? వెళ్లకుంటే ఇలా.?

అత్తగారు ఆహ్వానించలేదు కానీ భర్త రమ్మంటున్నారు… నేనేం చేయాలి..? వెళ్తే అలా.? వెళ్లకుంటే ఇలా.?

by Anudeep

Ads

మా అత్తగారికి నాకు కొంచెం మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నాం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా అత్తమామలతో కాకుండా వేరుగా ఉంటున్నాం . మా అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక బిడ్డ కలిగింది. ఇప్పుడు ఆమె మాకు దగ్గర కావాలని ఆశిస్తుంది అనుకుంటున్నాను.

Video Advertisement

మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక విహారయాత్ర జరపడానికి నిర్ణయించారు. ఈ విహారయాత్రకు తన కొడుకుని మరియు నాకు పుట్టిన నవజాత శిశువుని రమ్మని ఆహ్వానించారు. కానీ ఆ విహారయాత్రకు నాకు ఎటువంటి ఆహ్వానము ఇవ్వలేదు. నా ఉద్దేశం ప్రకారం ఆమె కొడుకుని మనవడిని మాత్రమే కోరుకుంటోందని ఆశిస్తున్నాను. నన్ను వాళ్ళలో ఒకరుగా ఆమె భావించటంలేదని నేను అనుకుంటున్నాను. నా భర్త మాత్రం నువ్వు ఖచ్చితంగా విహారయాత్రకు రావలసిందే  అంటున్నారు. నేను ఏమి చేయాలి అని కోరా ద్వారా తమ సమస్యను వ్యక్తం చేశారు.

అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు అనేవి చాలా సహజం. కొన్నిసార్లు ఈ మనస్పర్ధలు శృతిమించి హద్దులు దాటుతుంటాయి. ఒకరికి ఒకరు ప్రాముఖ్యతను తగ్గించుకుంటూ దూరం పెట్టుకుంటుంటారు. అత్త చేసే పనులకు కోడళ్లు విసుగుపోతుంటారు. ఇది సరిదిద్దుకునే తప్పే. మీ భర్త మీ అత్తగారికి దగ్గర చేయాలని భావిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను.

ఆ విహారయాత్రకు వెళ్లడం మంచిది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండి లేనిపోని ఆలోచనలతో భయపడే కన్నా, మీ అత్తగారి ఏర్పాటుచేసిన  విహారయాత్ర ద్వారా వారు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారు అనే విషయం మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు భయపడినట్లే జరిగితే మీ అత్తగారి విషపూరిత స్వభావం మీ భర్తకు అర్థమయ్యేలాగా చూపించండి. అప్పుడైనా ఆయన ఆమె తల్లి పట్ల భావనను మార్చుకుంటారు అనుకుంటున్నాను.


End of Article

You may also like