సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న F3 చిత్రంలో తమన్నా గెటప్..! అచ్చుగుద్దినట్లు దింపేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న F3 చిత్రంలో తమన్నా గెటప్..! అచ్చుగుద్దినట్లు దింపేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్..!

by Anudeep

Ads

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. ఈ చిత్రం F2 కి సీక్వెల్గా ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. F3 చిత్రానికి దిల్ రాజు మరియు శిరీష్ నిర్మాణ సారథ్యం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు అనే విషయం తెలిసిందే.

Video Advertisement

మొదటి భాగం విడుదలైన మూడు సంవత్సరాలు ఈ చిత్రం విడుదలైంది. దాదాపు మొదటి చిత్రంలో చేసిన పాత్రలన్నీ ఈ మూడవ భాగంలో కూడా కనిపిస్తాయి. సోనాల్ చౌహాన్, మురళి శర్మ రాజేంద్ర ప్రసాద్, ఆలీ, వెన్నెల కిషోర్, ప్రగతి, అన్నపూర్ణ, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.  ఫ్యామిలీ, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.

అయితే  ఈ చిత్రంలోని తమన్నా నటించిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చుగుద్దినట్టు దింపేశారుగా అంటూ  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇంతకీ ఏంటి విషయం అనుకుంటున్నారా..లాబ్ డబ్  లాబ్ డబ్ డబ్బు.. అనే పాటలో తమన్నా ఎల్లో సారీ గెటప్ లో కనిపిస్తుంది.

ఈ గెటప్ అచ్చుగుద్దినట్లు 1995లో సౌందర్య నటించిన అమ్మోరు చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సౌందర్య ఒక సన్నివేశంలో వేసుకున్న వేషధారణలో ఉన్నట్లు , F3 లో తమన్నా వేషధారణ అచ్చుగుద్దినట్టు ఒకే విధంగా క్రియేట్ చేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సౌందర్యను కాఫీ కొట్టేశారు అంటూ ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


End of Article

You may also like