Ads
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ డైరెక్టర్ లింగుసామి దీనికి దర్శకత్వం వహించగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా చేసారు. మరో నటుడు ఆది పినశెట్టి మరోసారి తన విలనిజంతో ప్రేక్షకులను అలరించనున్నాడు.
Video Advertisement
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో రామ్, కృతిశెట్టి ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. అలాగే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ తమిళనాడులో నిర్వహించగా.. నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ప్రీ రిలీజ్ లో యాంకర్ గా ఉన్న సుమ కనకాల నటుడు బ్రహ్మాజీని స్టేజ్ మీదకు పిలిచి.. మాట్లాడటానికి ముందు డాన్స్ చేయమన్నారు. స్టేజ్ పై బ్రహ్మాజీ, సుమ ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే..
అప్పుడు ది వారియర్ లో సూపర్ హిట్ అయిన బుల్లెట్ సాంగ్ ప్లే చేస్తే.. బ్రహ్మాజీ చాలా కామెడీ గా డాన్స్ చేస్తూ అందరినీ నవ్వించాడు. బ్రహ్మాజీ డాన్స్ చూసిన బెబమ్మ కృతిశెట్టి కూడా పడి పడి నవ్వింది. దీంతో ఇప్పుడు బ్రహ్మాజీ డాన్స్ నెట్టింట వైరల్ అవుతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా, తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న విషయం తెలిసిందే. బ్రహ్మాజీ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కింద వీడియో లింక్ ఉంది.
End of Article