Ads
అప్పట్లో అందాల తార ఆర్తి అగర్వాల్.. ఇప్పుడు బెబామ్మ కృతి శెట్టి ఈ విషయంలో తేడా ఏం లేదా..? అంటూ నెటిజన్స్ వీరిద్దరిని కంపేర్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. కెరీర్ ప్రారంభం నుంచే ఆర్తి సీనియర్ హీరోలతో నటించడానికి అంగీకరించింది. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో నటించి విజయాలు సొంతం చేసుకుంది.
Video Advertisement
అలాగే ఎన్టీఆర్, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. అయితే, ఆర్తీ ఏజ్ కి తగ్గట్టుగా కొంతకాలం యంగ్ హీరోల సరసన నటిస్తే కెరీర్ మరోలా ఉండేది. కానీ సీనియర్ హీరోలతో కలిసి నటించడం.. కొన్ని కథల ఎంపికలో చేసిన పొరపాటు.. అంతేకాక కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడటం వంటివి ఆర్తి కెరీర్ దెబ్బతినడానికి కారణం అయ్యాయి.
అయితే, దాదాపు ఇదే పంథాలో సాగుతుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో కృతి ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమా షూటింగ్ పూర్తై ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగానే కృతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా వరుసగా మూడు హిట్స్ పడటం విశేషం. దీంతో ఇప్పుడు కృతికి సౌత్ మొత్తం క్రేజ్ పెరిగిపోయింది. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. తమిళం, తెలుగులో రామ్ సరసన ది వారియర్ సినిమా కంప్లీట్ చేసింది. నితిన్ తో మాచర్ల నియోజిక వర్గం దాదాపు పూర్తైంది. ఇవి తన కెరీర్ కి ప్లస్ అయ్యేవే.
కానీ, తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించడమే సందేహాలకు తావిస్తుంది. అందులోనూ బాలా డైరెక్షన్ అనగానే ఆ సినిమా ఎంత వైవిధ్యంగా ఉన్నా.. హిట్ అనేది ఖచ్చితంగా చెప్పలేరు. దాంతో సూర్య సినిమా ఒప్పుకొని రాంగ్ స్టెప్ వేసిందని అంటున్నారు కొందరు. అంతేకాదు.. ఈ మధ్య ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో బెబామ్మ ప్రేమలో పడినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే జనాలు ఆర్తి అగర్వాల్ తో కృతి శెట్టిని పోల్చి చూడడంలో తప్పులేదు. మరి దీనిపై కృతి ఎలా స్పందిస్తుందో చూడాలి.
End of Article