Ads
సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే ఉన్న క్రేజ్ వేరే చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ అంటూ అన్ని భాషల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఆల్మోస్ట్ అందరు హీరోలతో నటించి టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రంతో ఫ్లాపులు అందుకున్న పూజా హెగ్డే క్రేజ్ ఎక్కడ తగ్గడం లేదు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన కూడా తెలుగు మరియు హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
Video Advertisement
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య డిజాస్టర్ కావడంతో ఇప్పటివరకు లక్కీ హీరోయిన్ అన్నవారే, సినిమాలకు ఐరన్ లెగ్ గా మారిందని సోషల్ మీడియాలో కామెంట్స్ తో ట్రోలింగ్ కి గురవుతుంది పూజా హెగ్డే.ఇదే సమయంలో పూజా హెగ్డే కి సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తిగా మారాయి.
బీస్ట్ మూవీ షూటింగ్ టైంలో పూజా హెగ్డే స్టాఫ్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయట. కేవలం వీళ్లు ఫుడ్ కి చేసిన ఖర్చు లక్షల్లో బిల్ వచ్చిందట దర్శకనిర్మాతలకు. ఇక ఈ బిల్ కాస్త పూజా హెగ్డే చేయబోయే ‘వి’ సినిమా నిర్మాతల వరకు వెళ్లిందట. ఆ బిల్ చూసి నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అనే సమాచారం వినిపిస్తుంది. పూజ స్టాఫ్ ఫుడ్ కి, మెయింటినెన్స్ కి అయిన బిల్లులు చూసి నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే బీస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో భారీ నష్టాలు చవిచూసిన నిర్మాతలు పూజా హెగ్డే మరియు ఆమె స్టాఫ్ చేసిన ఖర్చులతో మరింత భారం కావడంతో ఈ బిల్స్ తమకు సంబంధం లేదని, పూజా హెగ్డే స్టాఫ్ చేసిన ఖర్చులు పూజా హెగ్డేనే చెల్లించాలని ఆ బిల్స్ కాస్త ఆమె పంపించారట. బీస్ట్ మూవీ ప్లాప్ కావడంతో పూజా హెగ్డే కూడా సైలెంట్ గా ఆ బిల్స్ చెల్లించడానికి సిద్ధం అయిపోయిందట.
ఇంత జరిగిన కూడా పూజా హెగ్డే లో ఏ మాత్రం మార్పు రాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినబోయే చిత్రానికి కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి గాను పూజా హెగ్డే కొన్ని కండీషన్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించాలి అంటే తన స్టాఫ్ కి అయ్యే పూర్తి ఖర్చులు నిర్మాణ సంస్థ భరించాలి అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట పూజా హెగ్డే. ఇలా అయితే పూజా హెగ్డే తో చిత్రాలు చేయడం కష్టమే అంటూ సినీ ప్రముఖులు ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు.
End of Article