కాజల్ లేకపోవడంతో “ఆచార్య”కి అన్ని కోట్ల నష్టం వచ్చిందా..!?

కాజల్ లేకపోవడంతో “ఆచార్య”కి అన్ని కోట్ల నష్టం వచ్చిందా..!?

by Anudeep

Ads

సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్‌ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు.

Video Advertisement

సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది. మొదట ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల కాజల్ ను తొలగించారు. అయితే కాజల్ సినిమాలో లేకపోవడంతో కొరటాల శివకు భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆచార్య సినిమా దక్షిణాది భాషల హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేయగా ఆచార్య సినిమాలో కాజల్ ను తొలగించినందుకు రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మొత్తంలో కట్ చేసిందట. దీంతో పాటు తెలుగు మినహా ఇతర భాషల హక్కులు వద్దని చెబుతూ అందుకు సంబంధించిన ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా కట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆచార్య సినిమా బిజినెస్ వ్యవహారాలు కొరటాల దగ్గరుండి చూసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఆచార్య సీడెడ్ హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొరటాల శివ ఆఫీస్ లో రచ్చ చేశారు. కొరటాల శివ నుంచి వారికి 6 కోట్ల రూపాయలు అందినట్టు సమాచారం. ఆచార్య సీడెడ్ బయ్యర్లకు 15 కోట్ల రూపాయల నష్టం రాగా కొరటాల శివ 40 శాతం నష్టాలను భర్తీ చేయడంతో వాళ్లు శాంతించారని తెలుస్తోంది. ఆచార్య సినిమా కొరటాల శివ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. కొరటాల శివ తర్వాత సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like