GARGI REVIEW: “గార్గి” తో “సాయి పల్లవి” హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!

GARGI REVIEW: “గార్గి” తో “సాయి పల్లవి” హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!

by Anudeep

Ads

చిత్రం: గార్గి
నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, జే. జయ ప్రకాష్, ఆర్. ఎస్. శివాజీ
నిర్మాత: థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్
దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్
సంగీతం: గోవింద్ వసంత
విడుదల తేదీ: జూలై 15, 2022

Video Advertisement

స్టోరీ:

గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్.ఎస్. శివాజీ) అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఒక రోజు రాత్రి తండ్రి ఇంటికి రాకపోవడంతో అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళుతుంది గార్గి. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో తండ్రిని అరెస్ట్ చేశారని తెలుసుకుంటుంది. తన తండ్రి తప్పు చేయలేదని గార్గి బలంగా నమ్ముతుంది. తండ్రిని బయటకు తీసుకు రావడం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? గార్గి కుటుంబాన్ని సమాజం ఏ విధంగా చూసింది? తండ్రి నిర్దోషిగా బయటకు వచ్చాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.

రివ్యూ:
గార్గి వన్ ఉమెన్ షో. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ స్క్రీన్ ప్లే  అధ్బుతంగా ఉంది. అతను ఎవరి పక్షాన నిలబడలేదు.
‘గార్గి’ కథ చిన్నది. నిడివి కూడా తక్కువే. అయినప్పటికీ నిడివి ఎక్కువైన ఫీలింగ్. ఎటువంటి అనవసర సన్నివేశాలు లేకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. సాయి పల్లవి పాత్రను పరిచయం చేసిన వెంటనే ఆమె తండ్రి అరెస్ట్. సమాజం నుంచి ఎదురవుతున్న పరిస్థితులు. కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కథ ముందుకు కదలదు.

కోర్ట్ రూమ్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు… ‘గార్గి’లో కోర్ట్ సీన్స్ అంత ఆసక్తిగా అనిపించవు. ఇంటర్వెల్‌కు ముందు, తర్వాత సీన్స్‌లో మెలోడ్రామా ఎక్కువైంది. మళ్ళీ క్లైమాక్స్‌లో ముందు గాడిలో పడింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. కుమార్తె పాత్ర మీద పెట్టిన శ్రద్ధ, కుటుంబంలో ఇతర సభ్యులపై దర్శకుడు పెట్టలేదు. భర్త జైల్లో ఉంటే… ఒక సన్నివేశంలో అమ్మాయితో తల్లి ప్రవర్తించే తీరు వింతగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

  • సంగీతం
  • ప్రొడక్షన్ వాల్యూస్
  • డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • స్క్రీన్ ప్లే

రేటింగ్: 3.5/5

ట్యాగ్ లైన్: ఎమోషనల్ డ్రామా, కొత్త తరహా కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు నచ్చే సినిమా ‘గార్గి’. కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టిస్తాయి. సాయి పల్లవి మరోసారి అద్భుతంగా నటించారు. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే చిత్రమిది. సమాజంలో మహిళల భద్రత విషయంలో సందేశం ఇచ్చే చిత్రమిది.


End of Article

You may also like