Ads
సిల్క్ స్మిత.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం.. గ్లామరస్ పాత్రలు చేస్తు అప్పటి కుర్రకారుల హృదయంలో స్థానం సంపాదించుకుంది. తన కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కే మత్తెక్కించిన గ్లామరస్ యాక్టర్ సిల్క్ స్మిత. ఇంత ఇమేజ్ ను సొంతం చేసుకున్న సిల్క్ స్మిత. తన మరణం మాత్రం ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.
Video Advertisement
సిల్వర్ స్క్రీన్ లో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకోవడం అనేది సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది.
సినీ కెరీర్ పీక్స్ లో ఉండగా ఓ హీరోతో ప్రేమ విఫలమవడం, కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో సిల్క్ స్మిత డిప్రెషన్లోకి వెళ్ళింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే స్మిత తన చివర ఉత్తరంలో ఇలా రాసుకుంది. “దేవుడా నా 7వ సంవత్సరం నుండి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు.
నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుంటుంబానికి నా కుటుంబాని పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా.. అతడు నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు.
ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. నాకు ఒకడు 5సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను.” అంటూ సిల్క్ ఎంతో బాధతో ఉత్తరం రాసింది. సిల్క్ స్మిత జీవితాన్ని “డర్టీ పిక్చర్” అనే సినిమా పేరుతో డైరెక్టర్ మిలన్ లుథ్రియా తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్ లో నటించారు.
End of Article