Ads
మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు మీద ఇండియా జట్టు విజయం సాధించింది. మూడవ వన్డేలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మ్యాచ్ లో వెన్నునొప్పి కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండటంతో అతని స్థానంలో వచ్చిన మొహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే జానీ బెయిర్‌స్టో (0), జో రూట్(0) లను డకౌట్ గా పెవిలియన్ బాట పట్టించారు.
Video Advertisement
తర్వాత బెన్‌స్టోక్స్ (27)తో కలిసి జేసన్ రాయ్ (41) ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా కూడా హార్దిక్ పాండ్యా చాలా తెలివిగా ఆడడంతో 13.2 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ టీమ్ 74/4 స్కోర్ తో నిలిచింది.
తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో 3×4, 2×6) తో కలిసి మొయిన్ అలీ (34: 44 బంతుల్లో 2×4, 2×6) దూకుడుగా ఆడారు. జడేజా మొయిన్ అలీని అవుట్ చేయగా తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (27: 31 బంతుల్లో 2×4, 2×6) కూడా సిక్సర్లతో దూసుకెళ్లారు. కానీ హార్దిక్ పాండ్యా షార్ట్ పిచ్ బంతి విసిరి లివింగ్‌స్టోన్ ని అవుట్ చేశారు. అయినా కూడా చివరిలో క్రైగ్ ఓవర్టన్ (32), డేవిడ్ విల్లే (18) భారత బౌలర్లపై ఎదురు దాడి చేశారు. దాంతో ఇంగ్లండ్ జట్టు 259 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article