Ads
ప్రముఖ రాజకీయ మరియు సినిమా సెలబ్రిటీలకు భవిష్యత్తుని సూచించే జ్యోతిష్య పండితులు వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీకే నరేష్ కుటుంబంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను మొదటినుంచి కృష్ణ గారికి పెద్ద అభిమానిని.ఈ వృత్తి మొదలుపెట్టినప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంట్లో వారి ఉన్నత ఎదుగుదలకై పూజలు నిర్వహించేవాడిని.
Video Advertisement
2014లో కృష్ణ గారు విజయనిర్మల గారు జాతకాలు చూసి, 2020 సంవత్సరం లోపు మీ ఇద్దరిలో ఒకరి చనిపోతారని అప్పుడే చెప్పాను. అంతేకాకుండా నరేష్ జరగబోయే మూడో పెళ్లి గురించి, నరేష్, రమ్య రఘుపతికి మధ్య జరగబోయే వివాదాల గురించి నేను అప్పుడే ముందస్తు సూచన చేశాను.
ఈ విషయం ప్రస్తావించినప్పుడు నరేష్ కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయాలన్నీ విన్న విజయనిర్మలగారు ఎంతో భయాందోళనకు గురయ్యారు. పరిహారం చేసుకోవడం ద్వారా మీ కుటుంబానికి మంచి జరుగుతుందని వెల్లడించాను. నేను జాతకాలు గురించి చెప్పిన సంవత్సరంలోనే రమ్య మరియు నరేష్ గార్ల పెళ్లి జరిగింది. రమ్య, నరేష్ పెళ్లి విషయంపై వారి జాతకాలు చూసి ఇద్దరి జాతకాలు కలవడం లేదు.
పెళ్లి చేయకపోవడమే మంచిదని సూచించాను. ఒకవేళ పెళ్లి జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులు తీసుకుంటారని కూడా సూచించాను. అదేవిధంగా 2019లో విజయనిర్మల గారు మరణించారు. అప్పుడు నేను చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతుంది అని వేణు స్వామి ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. వేణు స్వామి చెప్పిన ఈ మాటలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
End of Article