“జబర్దస్త్ “లో నేను కట్టుకున్న చీరలన్నీ ఆమెవే.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన సత్యశ్రీ..!

“జబర్దస్త్ “లో నేను కట్టుకున్న చీరలన్నీ ఆమెవే.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన సత్యశ్రీ..!

by Anudeep

Ads

జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలకు మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది.

Video Advertisement

ఇందులో గుర్తింపు పొందిన అనేక మంది సినిమాల్లో కూడా నటిస్తు తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల రెమ్యున‌రేష‌న్ ఎక్కువ వ‌స్తుంద‌నే ఆశ‌తో ఇప్ప‌టికే చాలా మంది జ‌బ‌ర్దస్త్ ను వీడి వెళ్లిపోయారు. ఇక ఆ షోనే న‌మ్ముకుని బ్ర‌తుకుతున్న‌వాళ్లు కూడా ఉన్నారు.

 

జ‌బ‌ర్ద‌స్త్ ప్రారంభంలో కేవ‌లం మ‌గ‌వాళ్లు మాత్రం స్కిట్ లు చేసేవారు. ఆడ‌వాళ్ల పాత్ర అవ‌స‌రం అయితే ఆ పాత్ర‌లో కూడా చీర‌లు క‌ట్టుకుని వాళ్లే న‌టించేవారు. ఆ తర్వాత కొంత‌మంది ట్రాన్స్ జెండ‌ర్ ల‌కు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో అవ‌కాశం ఇవ్వ‌డంతో వాళ్ళ జీవితాలు కూడా సెటిల్ అయ్యాయి. అలా జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తో వ‌చ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆ త‌ర‌వాత మ‌హిళ‌ల‌కు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో అవ‌కాశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ షోలో క‌నిపించిన లేడీ కంటెస్టెంట్స్ లో స‌త్య శ్రీ ఎక్కువ‌గా పాపులారిటీని సంపాదించుకుంది. చంద్ర‌కు భార్యగా న‌టిస్తూ అభిమానుల‌ను సంపాదించుకుంది. తాజాగా స‌త్య‌శ్రీ జ‌బ‌ర్ద‌స్త్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న చీర క‌ట్టుకు అభిమానులు ఉన్నార‌ని చెప్పింది.

తాను చీర‌క‌ట్టుకుంటే వినోద్ ఎంత సేపు క‌ట్టుకుంటావ్ అంటూ హేళ‌న చేసేవాడ‌ని, తాను అర‌గంట సేపు చీర క‌ట్టుకునే దాన్న‌ని చెప్పింది. ఇక తాను క‌ట్టుకున్న చీర‌లు అన్నీ త‌న త‌ల్లివే అని సత్యశ్రీ తెలిపింది. దాదాపు 500 ఎపిసోడ్ ల‌లో తాను క‌ట్టిన చీర‌ను మ‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది. అయితే షో నిర్వాహ‌కులు ఇచ్చిన చీర‌ల‌ను మ‌రికొన్ని స్కిట్ ల‌లో మార్చిమార్చి క‌ట్టుకుంటార‌ని ఆమె చెప్పుకొచ్చింది.


End of Article

You may also like