Ads
ఈ మధ్య తెలుగు సినిమా ట్రైలర్లకు, సినిమాలకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. అసలు విదేశీయుల రియాక్షన్ వీడియోస్ అంటే ఏంటంటే.. మన తెలుగు సినిమాను వాళ్ళు ప్లే చేస్తూ.. సినిమాలోని మాటలకు, పాటలకు, ఫైట్లకు వాళ్ళ స్టైల్ ల్లో రియాక్షన్స్ ఇస్తుంటారు.
Video Advertisement
ఉదాహరణకు.. వావ్, సూపర్, ఫెంటాస్టిక్ లాంటివి. ఇది ఒకరకంగా చెప్పాలి అంటే.. క్రికెట్ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటుంది. మన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలకు వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వీడియోలకు కోట్లలో వ్యూస్ రావడం గమనార్హం. అసలు ఆ వీడియోలకు అంత క్రేజ్ ఉందో చూద్దాం..
ఇక్కడ ముందు మనం ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి.. నిజానికి వాళ్ళు మన సినిమాను పొగిడినంత మాత్రాన సినిమా గొప్పది అవదు. వాళ్ళు విమర్శించినంత మాత్రాన చెత్తది అవదు. మన గొప్పతనం మనది, వాళ్ళ గొప్పతనం వాళ్ళది. ఏ పదార్ధమైన, కళ అయినా, పాటైనా, మాటైనా , నాట్యమైన, ఇతివృత్తమైనా సంస్కృతికి సంబంధించిన ఏదైనా వాటి సారాంశం మూలాల్లో ఉంటుంది. అది తెలిస్తేనే వాటి గొప్పతనం అర్ధం అవుతుంది.
Watch Video:
అది తెలీకుండా ఏదో వ్యూస్ కోసమో, డబ్బు కోసమో ఆహా.. ఓహో.. అని వాళ్ళు అన్నంత మాత్రాన అది వాళ్ళు మన సంస్కృతిని తెలుసుకున్నట్టు కాదు. ఇది ఒకరకంగా రియాక్షన్ పేరుతో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నట్టు! రియాక్షన్ వీడియోస్ కి అన్ని కోట్ల వ్యూస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో యువత ఎక్కువగా ఖాళీగా ఉన్నారేమో అనిపిస్తుంది. బీటెక్ లు, ఎంటెక్ లు చేసి కూడా ఇక్కడి యూత్ ఖాళీగా ఉంటారు.
పాతికెళ్లొచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతారు. ఆఖరికి అతని షేవింగ్ కి డబ్బులు కూడా ఆమ్మో, నాన్నో ఇవ్వాలి. అలాంటి వాడు మహేష్ బాబు హెయిర్ స్టైల్ గురించి లేక అతను వాడే 80 లక్షల కార్ గురించి గంటల కొద్ది సొల్లు చెబుతాడు. ఇది చాలదు అన్నట్టు స్కూల్ పిల్లలకు వీళ్లంటే హీరో వర్షిప్. అన్నా.. అన్నా.. అంటూ బీటెక్ కుర్రకారు వెనక తిరగడం, వాడేదో పొడిచి పారిసినట్టు! వాళ్ళు చేసేవి, చూసేవి ఈ పిల్లలు గుడ్డిగా ఫాలో అవుతారు.
Watch Video:
ఇంకా అసలు విషయానికొస్తే.. అలాంటి కుర్రకారు ప్రతి ఇంట్లో, వీధిలో, ఊర్లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఫోన్ కెలుకుతూ ఇలాంటి పనికి రాని వాటికి హైప్ క్రియేట్ చేస్తుంటారు. అది చూసి మిగతా వాళ్ళు గొర్రెల్లా ఫాలో అవ్వడంతో విదేశీయుల రియాక్షన్ వీడియోలకు అంత క్రేజ్ పెరుగుతుంది. దీని వల్ల వాళ్ళు లాభపడతారు కానీ మనకి టైం వేస్ట్ వ్యవహారం.
End of Article