Ads
ఇతర వ్యాపార సంస్థలు నడుపుతూ అందులో సక్సెస్ అయ్యి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటులు చాలా మందే ఉన్నారు.
Video Advertisement
ఇప్పుడు లెజెండ్ శరవణన్ ను మొదలుకొని, విష్ణు, ఉదయ్ చోప్రా, అల్లు శిరీష్ ఇలా అనేక మంది ఉన్నారు. ఒకసారి ఇతర బిజినెస్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో నటులుగా ఉన్న కొంతమందిని చూద్దాం..
#1. అరుల్ శరవణన్:
శరవణన్.. చెన్నై లో శరవణ స్టోర్స్ అనే వస్త్ర మరియు ఆభరణాల దుకాణాలను రన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ది లెజెండ్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శరవణన్.
#2. మంచు విష్ణు:
మంచు విష్ణు మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ తో పాటు న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ లకు మెంబర్ గా, చైర్మన్ గా ఉన్నారు విష్ణు.
#3. సచిన్ జోషి:
సచిన్ జోషి, తండ్రి, జగదీష్ జోషి, జేఎంజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని. సచిన్ లంక ప్రీమియర్ లీగ్ (LPL), దంబుల్లా వైకింగ్స్ యొక్క దంబుల్లా ఫ్రాంచైజీని కూడా కలిగి ఉన్నాడు. తెలుగులో ఒరేయ్ పండు అనే మూవీ చేసాడు సచిన్.
#4. అల్లు శిరీష్:
అల్లు శిరీష్ గీతా ఎంటర్టైన్మెంట్ కి డైరెక్టర్ గా చేసాడు. ఓ మ్యాగజైన్ ని కూడా అప్పట్లో రన్ చేసాడు. గౌరవం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శిరీష్.
#5. ఉదయ్ చోప్రా:
ఉదయ్ చోప్రా బాలీవుడ్ యాక్టర్. ఇతను యశ్ రాజ్ ఫిలిమ్స్ మేనేజర్ గా, యశ్ రాజ్ ఎంటర్టైన్మెంట్ ఓనర్ మరియు మేనేజర్ గా చేసాడు.
#6. నాగబాబు:
టాలీవుడ్ యాక్టర్, ఒకప్పటి హీరో నాగబాబు మొదట ప్రొడ్యూసర్ గా చేసి టాలీవుడ్ లో నటుడిగా స్థిరపడ్డారు.
#7. ఉదయనిధి స్టాలిన్:
ఉదయనిధి స్టాలిన్ ప్రొడ్యూసర్ మరియు రాజకీయ నాయకుడు. ఎమ్ఎల్ఏ గా కూడా ఓ సారి ఎన్నికయ్యారు. ఇతని తమిళ్ మూవీస్ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అందులో శ్రీనుగాడి లవ్ స్టోరీ ఒకటి.
#8. చెరుకూరి సుమన్:
సుమన్ టెలివిజన్ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా చేసారు సుమన్.
#9. రానా దగ్గుబాటి:
రానా దగ్గుబాటి నటనతో పాటు సినిమా సెట్‌లో విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రానా సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు.. Ikonz అనే భారతీయ-అమెరికన్ సంస్థకు రానా ఐపీ (IP) హక్కులను కలిగి ఉన్నాడు.
#10. అల్లు అరవింద్:
అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చిత్రాలు నిర్మిస్తున్నారు మరియు తెలుగు సినిమా పంపిణీదారుగా కూడా చేస్తున్నారు. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ FC సహ యజమాని. అల్లు అరవింద్ ‘హీరో, మహానగరంలో మాయగాళ్ళు, చంటబ్బాయి’ వంటి చిత్రాల్లో నటించారు.
End of Article