Ads
నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. “అంటే సుందరానికి..” సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూసారు. మొత్తానికి “అంటే సుందరానికి..” సినిమాతో నాని అభిమానుల కోరిక నెరవేరిందనే చెప్పొచ్చు.
Video Advertisement
సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం నాని, నజ్రియా.
నాని చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ విన్నీ శేఖర్ మంచి మార్కులే కొట్టేసాడు. అయితే, విన్నీ.. శేఖర్ మాస్టర్ కొడుకు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో అలరించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ హారిక. ఆమె నజ్రియా చిన్నప్పటి రోల్ ను పోషించారు. విన్నీ శేఖర్, హారిక ల మధ్య నడిచిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే.. చైల్డ్ ఆర్టిస్ట్ హారిక ఎవరు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ అమ్మాయి తెలుగు వారికి పరిచయమైన నటే. అయినా చాలా మంది ఆమెని గుర్తుపట్టలేదు. స్టార్ మా లో ప్రసారం అయిన కోయిలమ్మ సీరియల్ లో హారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
కోయిలమ్మ సీరియల్ టైములో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన హారిక ఆ తరువాత తెరపై కనిపించలేదు. తాజాగా.. అంటే సుందరానికి సినిమాతో హారిక తిరిగి ఇండస్ట్రీ లోకి వచ్చారు. కొంతమంది ఆమెని గుర్తుపట్టారు కూడా. కేవలం అంటే సుందరానికి సినిమాలోనే కాకుండా.. అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో కూడా హారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించారు. ఇంకా.. వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న ” రంగ రంగ వైభవంగా ” సినిమాలో కూడా నటిస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత వరుస అవకాశాలతో చైల్డ్ ఆర్టిస్ట్ హారిక దూసుకెళ్తున్నారనే చెప్పాలి.
End of Article