Ads
అలనాటి నటుడు నందమూరి తారకరామారావు ఇంట విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి హఠాన్మరణం పొందారు. కంఠమనేని ఉమా మహేశ్వరి ఎన్టీఆర్ కు స్వయానా నాలుగవ కుమార్తె. ఆమె మరణంతో ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉమా మహేశ్వరి కన్నుమూశారు.
Video Advertisement
ఈ సోమవారం అనగా.. ఆగస్టు ఒకటవ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ ప్రముఖులు ఆమెను కడసారి చూడడం కోసం ఆమె ఇంటికి చేరుకున్నారు. నేడు ఆమెకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. నందమూరి కుటుంబానికి చెందిన ఓ ఆసక్తికర అంశంపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది.
గత కొంత కాలంగా ఎన్టీఆర్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 లో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉమా మహేశ్వరి కూడా ఆగష్టు నెలలోనే మృతి చెందడం గమనార్హం. ఈ క్రమంలో ఎన్టీఆర్ సంతానం ఎంత మంది స్వర్గస్తులయ్యారు అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి లిస్ట్ మీరు కూడా చూసేయండి.
1. హరికృష్ణ:
నందమూరి హరికృష్ణ ఆగష్టు 29 వ తేదీ 2019 న ఓ పెళ్ళికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
2. ఉమా మహేశ్వరి:
ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఆగష్టు ఒకటవ తేదీ సోమవారం రోజున ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
3. రామకృష్ణ:
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లారు. కానీ.. అతని మృతిని జీర్ణించుకోవడానికి ఎన్టీఆర్ కు చాలా కాలమే పట్టింది.
4.సాయికృష్ణ:
ఎన్టీఆర్ ఐదవ కొడుకు సాయి కృష్ణ కూడా కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఎన్టీఆర్ కు సంబంధించిన పర్సనల్ విషయాలను చూసుకునేవారు.
ఎన్టీఆర్ కు మొత్తం పన్నెండు మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు కాగా.. మరో నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె స్వర్గస్తులయ్యారు.
End of Article