Home Sports Adda “వెస్టిండీస్” తో జరిగిన మ్యాచ్ లో… ఆ 3 ప్లేయర్స్ ఒకటే “జెర్సీ” వేసుకోడానికి కారణం ఏంటో తెలుసా?

“వెస్టిండీస్” తో జరిగిన మ్యాచ్ లో… ఆ 3 ప్లేయర్స్ ఒకటే “జెర్సీ” వేసుకోడానికి కారణం ఏంటో తెలుసా?

by Mohana Priya

భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల t20 సిరీస్ లోని రెండవ మ్యాచ్ అనుకున్న సమయానికి జరగకుండా కొద్దిగా డిలే అయింది. కానీ ఇందుకు కారణం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.

మామూలుగా మనకు తెలిసి ఒక మ్యాచ్ డిలే అవడం కానీ వాయిదా పడడం గానీ జరిగేది వాన వల్ల కానీ లేదు ఇతర ఇతర కారణాల వల్ల కానీ, ఇండియాకు వెస్టిండీస్ కు జరిగిన ఈ మ్యాచ్ లో మాత్రం మిస్సయిన లగేజీలు మ్యాచ్ పోస్ట్ పోన్మెంట్ కి కారణమయ్యాయి.

why these players wore same jersey in ind vs wi

అనుకున్న సమయానికి భారత్ జట్టు ఆటగాళ్ల లగేజ్ స్టేడియం కు చేరలేదు..భారత్ జట్టు బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ , అర్షద్వీప్, ఆవేశ్ ఖాన్ లు ముగ్గురు ఒకే పేరు, నెంబరు ఉన్న జెర్సీని వేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తదుపరి ఫీల్డింగ్ సమయంలో కూడా ఒకే నెంబర్ జెర్సీ ముగ్గురు ఆటగాళ్లు వేసుకున్నందువల్ల చాలా గందరగోళం నెలకొంది.

why these players wore same jersey in ind vs wi

 

ఇంక వివరాల్లోకి వెళ్తే ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కి రావాల్సిన క్రికెటర్ల లగేజ్ సమయానికి చేరుకోలేదు, ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ మరియు అవేష్ ఖాన్ ల వద్ద జెర్సీలు లేకపోవడంతో ,ఫాస్ట్ బౌలర్ అయిన అర్షద్వీప్ సింగ్ దగ్గర ఉన్న రెండు ఎక్స్ట్రా మ్యాచ్ జెర్సీలను ధరించి గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట ఈ ముగ్గురి ఆటగాళ్ల ఒకే జెర్సీ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.

You may also like