తనకు పిల్లలు లేరు అని రోజు ఈ స్కూల్ టీచర్ చేస్తున్న పని ఏంటో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

తనకు పిల్లలు లేరు అని రోజు ఈ స్కూల్ టీచర్ చేస్తున్న పని ఏంటో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Anudeep

Ads

విద్యార్థుల కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాలలోని విద్యావ్యవస్థల లో ఇప్పటికీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో వెలుగును నింపుతూ కొందరు ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకే మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.

Video Advertisement

Also Read: హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈ స్టార్ట్ హీరో భార్య ఎవరో గుర్తుపట్టారా.? వైరల్ అవుతున్న ఫోటో.!

 

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ని స్కూటీ వలీ మేడమ్ గ్రామీణ విద్యార్థుల కోసం వినూత్నంగా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ జిల్లాలోని భైందేహి పరిధిలోని ధుదియా మారుమూల ప్రాంతం కావడం చేత రవాణా సౌకర్యాలు లోపించడం వల్ల పిల్లలు కాలినడకన బడికి వెళ్ళవలసి వస్తుంది. ఈ కారణం చేత చాలామంది పిల్లలు బడికి వెళ్లడమే మానేయడం వల్ల ఆ పాఠశాలలు మూతపడే దశకు చేరుకున్నాయి.ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి అరుణా మహాలే అనే
ఉపాధ్యాయురాలు నడుం బిగించింది.

స్కూల్ మానేసిన పిల్లలు అందరిని ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు తీసుకువెళ్లడం ప్రారంభించింది. ఇలా ప్రస్తుతం ఆమె రోజు 17 మంది పిల్లలను తన స్కూటీపై పాఠశాలకు తీసుకొని వస్తున్నారు.
“సరైన సౌకర్యాలు లేక పిల్లలు బడికి రావడం మానుకోవడం వల్ల స్కూల్ మూతపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది చూసి తట్టుకోలేకపోయిన నేను పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి స్కూటీ మీద స్కూల్ కి తీసుకురావడం మొదలుపెట్టాను. ఒక్కసారి నలుగురు పిల్లల్ని మాత్రమే తీసుకు రాగలగడంతో కనీసం నాలుగు రౌండ్ల అయినా తిరగడానికి ప్రయత్నించేదాన్ని.

Amazing is this scooty madam, the school which the government was closing, made it alive | Dailyindia.net

నేను పడే తపన గమనించిన చుట్టుపక్కల వాళ్ళు తమ స్కూటర్ పై పిల్లలను స్కూల్ కి దింపడం మొదలుపెట్టారు. అలా ఇప్పుడు స్కూల్ కి వస్తున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరిగింది. నాకు పిల్లలు లేరు అందుకే స్కూల్ పిల్లలే నా సొంత పిల్లలు అని భావిస్తున్నాను,పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవడం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదు”చేస్తున్న పనుల గురించి మీడియాతో చెప్పారు.
మన సమాజానికి ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయుల అవసరం ఎంతో ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Also Read:   మహేష్ “పోకిరి” సూపర్ హిట్ వెనకాల ఉన్న…”మెగా” సీక్రెట్ ఏంటో మీకు తెలుసా.?


End of Article

You may also like