Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.
Video Advertisement
బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది.
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది స్టూడెంట్ నెంబర్ 1. ఇది రాజమౌళి మొదటి సినిమా. ఈ సినిమాతోనే రాజమౌళి హిట్ కొట్టారు. ఆ తరువాత వీరిద్దరూ సింహాద్రి సినిమా చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరికీ ఒక ప్రత్యేక స్థానం వచ్చేలా చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే పొరపాట్లు జరగడం అనేది సహజం.
ఈ సినిమాలో కూడా అలాంటి పొరపాటు ఒకటి జరిగింది. ఒక సీన్ లో జూనియర్ ఎన్టీఆర్ గోల్ఫ్ బాల్ ని చేతితో పిండి పిండి చేస్తారు. అసలు మామూలుగా అయితే ఆ బాల్ ఎంత ఒత్తిడి పెట్టినా సరే విరిగిపోదు. దాంతో చాలా మంది, “అసలు మెషిన్ తో విడగొట్టడానికి ప్రయత్నించినా కూడా బాల్ విరగదు. అలాంటిది చేతితో బాల్ ఎలా విరగ్గొట్టారు?” అంటూ కామెంట్స్ చేశారు. ఇది పాత సీన్ అయినా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article