Ads
రాను రాను జనాలు ఎక్కువగా డబ్బు పోగేసుకోవడం. ఆస్తిని పెంచుకోవడం వైపే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మానవ సంబంధాలకు కూడా దూరమవుతున్నారు. సాధారణంగా ప్రతీ మనిషి చచ్చే లోపు ఏమి చేసాము అనేదనికంటే ఎంత సంపాదించాము? ఎంత ఆస్తి ఉంది అనేదే ఎక్కువ ఆలోచిస్తుంటారు. కొందరు అయితే కోట్లకు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా ఇతరులకు ఇవ్వాలనే ఆలోచన కూడా పెట్టుకోరు. అంతకు అయితే ఇతరుల దగ్గరే ఎక్కువ తీసుకోవాలి అనుకుంటారు. చనిపోయే ముందు ఏమి తీసుకెళతారు ఈ డబ్బు కోసం ఎందుకు అంత పిచ్చి అంటే కూడా ఇలాంటి సూక్తులను తీసి పడేస్తుంటారు.
Video Advertisement
కానీ ఒక నటి మాత్రం తన మానవత్వాన్ని చాటి చూపారు. ఇతరులకి సహాయం చెయ్యడం తన బాధ్యతగా భావించారు. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె యావదాస్తిని, గుళ్లకి, స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇచ్చేశారు. ఇంతకీ ఆ నాటి ఎవరో కాదండీ..! కాంచన వీరాభిమన్యు. మన పెద్దలకు ఈమె పేరు చెప్పగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. నేటి తరం యువతకు గుర్తొచ్చేలా చెప్పాలి అంటే, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అర్జున్ రెడ్డీ మూవీలో, హీరోకి గ్రాండ్ మదర్ గా కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా?
అయితే తొలుత కాంచన ఎయిర్ హోస్టెస్ గా పని చేసేవారట. కాగా అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించారు. తద్వారా తన నటనతో, మంచి హిట్లు అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సువర్ణ సుందరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కాంచన..తరువాత తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో అనేక సినిమాలు తీశారు. మరీ ముఖ్యంగా ఆత్మ గౌరవం, అవే కళ్ళు వంటి సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరు కూడా పొందారు.
ఇకపోతే ఆమెకు అప్పట్లోనే కాదు, ఈ కాలం వారిలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారట. హీరోయిన్ తరువాత కుడా ఎన్నో సైడ్ రోల్స్ లో కీలక పాత్రలు పోషిస్తూ, నటనా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దాని ద్వారా సంపాదించుకున్న ఆస్తిని ఏ మాత్రం ఆలోచించకుండా, దానం చెయ్యడం ఎంతో గొప్ప విషయం అంటూ, ప్రజలు మరింత అభిమానం పెంచుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల వళ్ళ ప్రజలు ఎంతో ప్రేరణ పొందుతారని అంటున్నారు. ఇక కాంచన అభిమన్యు ఆగస్ట్ 16 వ తేదీన, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. దీని బట్టి ఆమె తెలుగు అమ్మాయి కావడం విశేషం అనే చెప్పొచ్చు. దీంతో తెలుగు ప్రజలు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.
End of Article