తండ్రి చనిపోయినా… ఆయన కలను నెరవేర్చిన మహిళా క్రికెటర్ “రేణుకా ఠాకూర్‌” గురించి ఈ విషయాలు తెలుసా.?

తండ్రి చనిపోయినా… ఆయన కలను నెరవేర్చిన మహిళా క్రికెటర్ “రేణుకా ఠాకూర్‌” గురించి ఈ విషయాలు తెలుసా.?

by Anudeep

Ads

ప్రస్తుతం లేడీ క్రికెటర్లలో బాగా పాపులర్ అయిన పేరు రేణుక సింగ్ ఠాకూర్. పాతికేళ్ల రేణుక హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని పర్సా అనే ఒక చిన్న కొండ ప్రాంతం నుంచి వచ్చింది.

Video Advertisement

మూడేళ్ల వయసు అప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు. అతనికి క్రికెట్ అంటే ఎంతో మక్కువ తన పిల్లల్లో ఒకరినైనా క్రికెటర్ గా చూడాలని ఆయన కల తీరకుండానే ఆయన చనిపోయారు. కన్నతండ్రి కలం నెరవేర్చడం కోసం రేణుక చిన్నతనం నుంచే ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు.

క్రికెట్ అవ్వాలి అని అనుకున్న రేణుకకు ఎక్కడ నుంచి తన కోచింగ్ ప్రారంభం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఆమెకు మార్గనిర్దేశం చేసేందుకు కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో ఆమె స్థానికంగా ఉండే అబ్బాయిలతో పోటీపడి గెలవడానికి ప్రయత్నించే. ఆటల పట్ల మీకు ఉన్న మక్కువ చూసి ఆమె అంకుల్ ధర్మశాల లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో రేణుకను చేర్పించారు. అక్కడ నుంచి తల నైపుణ్యానికి ఎన్నో మెరుగులు దిద్దుకున్న రేణుక ఒక మంచి క్రికెటర్ గా ఎదిగింది.

క్రమంగా బౌలింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించిన రేణుక మంచి పేసర్ గా తన నైపుణ్యానికి పదును పెట్టింది. 2019లో బీసీసీఐ నిర్వహించిన వన్డే టోర్నమెంట్ లో 23 వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించింది. ఆ మ్యాచ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె జాతీయస్థాయి టోర్నమెంట్లకు సెలెక్ట్ అయ్యి గత సంవత్సరం అక్టోబర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన టి20 క్రికెట్ మ్యాచ్ తో భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించింది.
ఆ సిరీస్ లోని మూడో మ్యాచ్లో అలిస్సా హీలే వికెట్‌ పడగొట్టి.. తన వికెట్ల ఖాతాకు భారీ ఓపెనింగ్ ఇచ్చింది.

“రేణుక తన స్వింగ్‌ మాయాజాలంతో మరోసారి అదరగొట్టింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా నిలిచింది. ఇదో గొప్ప విజయం. ఆమె మోము సిమ్లా ప్రశాంతతకు, ఆమె చిరునవ్వు అక్కడి పర్వతాల ఆహ్లాదకర వాతావరణానికి నిదర్శనం.. ఆమె దూకుడు అగ్రశ్రేణి బ్యాటర్లను సైతం ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు. ఇలాంటి అత్యద్భుత ప్రదర్శన ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతుంది..” అని ఆమె ప్రతిభను చూసి స్వయంగా భారత ప్రధాని మోడీజీ ఆమెను కొనియాడారు. ఈ ప్రశంసలు విని ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. తన పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని తండ్రి ఎక్కడ ఉన్నా గర్వంతో సంతోషిస్తారని ఆమె తల్లి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


End of Article

You may also like