Ads
రీసెంట్ గా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ చిత్రం ఆగస్ట్ 25న దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్న సందర్భంలో చిత్ర టీమ్ అంతా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వరస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు కండక్ట్ చేస్తూ సినిమా గురించి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నటీనటులు ఇంటర్వ్యూలలో సినిమా గురించే కాకుండా తమ నిజ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
Video Advertisement
ఈ క్రమంలో తాజాగా లైగర్ విడుదల సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ అనన్యా పాండే నేటిజన్లో అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చారు.
“మీరు ఇప్పటివరకు నటించిన పాత్రలకు లైగర్ లోని పాత్రకు తేడా ఏమిటి?” అన్న ప్రశ్నకు అనన్యా పాండే “ఇప్పటివరకు నేను పోషించిన అన్ని పాత్రలు కంటే లైగర్ లో పోషించిన తానియా పాత్ర డిఫరెంట్. ఈ పాత్ర వివిధ రకాల భావోద్వేగాలు పండించే అవకాశం కలిగిన పాత్ర.”అని సమాధానం ఇచ్చారు. “నటుడిగా మీ కెరీర్ చివరి దశలో ప్రేక్షకుల మిమ్మల్ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలని మీరు ఆశిస్తున్నారు” అని విజయ్ దేవరకొండ ను అడుగగా .
దీనికి విజయ్ సమాధానం ఇస్తూ…”నా కెరీర్ ముగింపు దశలో నన్ను ఎవరు గుర్తు పెట్టుకోవాలి అని నేను ఆశించడం లేదు. ఆ టైంలో అందరూ నన్ను మర్చిపోవాలని కోరుకుంటున్నాను. నా కెరీర్ చివరి దశలో ఉంటే దయచేసి మీరందరూ నన్ను మర్చిపోయి మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి”అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్ లో వైరల్ గా మారాయి. “మీ దృష్టిలో ఫైటర్ అంటే ఎవరు”అన్న ప్రశ్నకు ” ఈ సమాజంలో ప్రేమ ,డబ్బు ,హోదా,గౌరవం ,సంతోషం ,మనకంటూ ఒక స్థానం వీటన్నిటి కోసం పోరాడే వ్యక్తిని నేను ఫైటర్ అని అభివర్ణిస్తాను. నా పోరాటం కూడా అందుకే”అంటూ సమాధానం ఇచ్చారు విజయ్.
End of Article