Ads
వివాహబంధం లో ఒక్కో సారి పరిస్థితుల వల్ల వచ్చే దూరం ఇద్దరు వ్యక్తుల్ని దూరం చేయకూడదు. పరిస్థితుల్ని అర్ధం చేసుకుని నడవాలే తప్ప ఒకరికొకరు దూరం కాకూడదు.
Video Advertisement
ఈ విషయాన్నీ వివరిస్తూ ఓ అద్భుతమైన కథ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరు కూడా చదివేయండి. ఈ కథను ప్రతి భార్య, భర్త తప్పక చదవాలి.
ఓ భర్త తన ఆఫీస్ లో మరో మహిళ ప్రేమ లో పడి భార్యను నిర్లక్ష్యం చేసాడు. రాను రాను..అతనికి తన వివాహ బంధం పట్ల విసుగు కలగసాగింది. దీనితో, ఆమెకు విడాకులు ఇచ్చి, తన ఆఫీసులో మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదేవిషయాన్ని అతను ఓ రోజు రాత్రి తన భార్యతో చెప్పాడు. అది వినగానే, అతని భార్య ఉలిక్కి పడింది.
భర్త పై కోపం గా ప్రవర్తించింది. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఏడుస్తూ కూర్చుంది. చివరకి ఓ నిర్ణయానికి వచ్చి.. పెన్ను పేపర్ తీసి రాయడం మొదలు పెట్టింది. ఆమె భర్త మధ్యలో లేచి చూసినప్పటికీ ఆమె రాస్తూనే ఉంది. అవేమి పట్టించుకోకుండా అతను పడుకుని.. ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆరోజు సాయంత్రం ఆమె అతనితో విడాకులకు ఒప్పుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని షరతులు విధించింది.
ఒక నెలరోజుల పాటు విడాకులు లేకుండా సాధారణమైన జీవితం గడపాలని కోరింది. అందుకు గల కారణాలు కూడా చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి. నెల రోజుల్లో పిల్లాడికి పరీక్షలు ఉన్నాయి. ఈ సమయం లో విడాకులు తీసుకుని బాబుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆగాలని కోరింది. ఈ నెల రోజులు పెళ్లి అయిన కొత్త లో లాగ, బెడ్ రూమ్ నుంచి హాల్ వరకు తనను ఎత్తుకుని తీసుకు రావాలని కోరింది.
మొదటి షరతులో అతనికి అభ్యంతరం కనిపించకపోయినా, రెండవ షరతు చూసి అతను విస్తుపోయాడు. సరేలే.. కలిసి ఉండేది నెల రోజులే కదా అని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి రోజు ఆమె ను ఎత్తుకుని హాల్ వరకు తీసుకొచ్చేవాడు. మొదటి రోజు కొంత మోటు గా అనిపించినా.. రెండవ రోజు నుంచి… అతనికి చాలా తేలిక గా అనిపించడం మొదలైంది.
ఇదే విషయాన్నీ అతను తన లవర్ కి చెప్పగా.. ఆమె పైకి నవ్వేసి.. విడాకులివ్వడం ఇష్టం లేక నాటకాలాడుతోంది అని వ్యంగం గా అంది. ఆ మాటలు అతనికి నచ్చకపోయినా అప్పటికి ఊరుకున్నాడు. ఆ తరువాత, రోజు అతను ఆమెను ఎత్తుకోవడం చూసి ఆ పిల్లాడు ఎంతో సంబర పడేవాడు. అయితే, చివరి రోజు వచ్చేసరికి అతని హృదయం బరువెక్కింది.రోజు రోజుకు ఆమె తేలికపడుతుంటే ఆమె వ్యధ వల్లనే బరువు తగ్గిపోతోందని అతను భావించాడు.
ఇక ఉండబట్టలేక పరిగెత్తుకుంటూ అతని లవర్ దగ్గరకు వెళ్లి.. నేను నా భార్య కు విడాకులు ఇవ్వడం లేదు.. మా బంధం లో అన్యోన్యత లోపించడం వల్లనే విసుగు చెందాను. కానీ, ఈ నెల రోజుల్లో ఆ అన్యోన్యత నాకు తెలిసి వచ్చింది. నా భార్య లేకుండా నేను ఉండలేను అని చెప్పి వచ్చేసాడు. దారిలో వస్తూ.. ఓ ఫ్లవర్ బొకే ను తీసుకున్నాడు. దానిపై ” మరణం మనల్ని వేరు చేసేదాకా నిన్ను మోస్తూనే ఉండాలని కోరుకుంటున్నా ” అని రాయించి తీసుకొచ్చాడు.
ఇంటికొచ్చి భార్య కోసం వెతుకగా, ఆమె మంచం పై చనిపోయి కనిపించింది. అతనికేమి అర్ధం కాలేదు. ఆ తరువాత అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే.. ఆమె గత కొన్ని నెలలు గా కాన్సర్ తో బాధపడుతోంది. ఈ విషయాన్నీ గమనించకుండా విడాకులు కోరాడు. దీనితో అతను మరింత వ్యధ అనుభవించాడు. విడాకుల గురించి కొడుకుకు తెలియకుండా ఆమె జాగ్రత్తబడింది. తననొక ప్రేమించే భర్త గా కొడుక్కి చూపించింది.
అంతులేని ప్రేమని పంచిన ఆమె ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ భర్త తన తప్పు తాను తెలుసుకున్నాడు. కానీ వెళ్ళిపోయినా భార్యను మాత్రం తీసుకురాలేడు కదా.. అందుకే భార్య భర్తలు ఎప్పుడు అన్యోన్యం గా ఉండాలి. కలిసి చర్చించుకుని సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి.
End of Article