Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.
Video Advertisement
కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. సినిమాపై నెగిటివ్ టాక్ వస్తోంది. అంచనాలను అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో చాలా ట్రోల్ల్స్ వస్తున్నాయి.
ఇక ఇందులో పలువురు కీలక పాత్రలు పోషించగా, పారితోషికం కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు అనే వార్త వైరల్ అవుతుంది.. ఈ మేరకు విజయ్ దేవరకొండ కూడా భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. మరోవైపు కీలక పాత్ర పోషించిన ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా తీసుకున్నారట. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో లిస్ట్ ఓ లుక్ వేయండి.
#1 విజయ్ దేవరకొండ – 35 crores
విజయ్ దేవరకొండ ఈ సినిమాకి 35 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
#2 మైక్ టైసన్ – 40 crores
మైక్ టైసన్ ఈ సినిమాలో అందరి కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మైక్ టైసన్ 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
#3 అనన్య పాండే – 3 crores
ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే 3 కోట్ల పారితోషకం తీసుకున్నారు.
#4. రమ్యకృష్ణ – 1 crore
“ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు ఇందులో రమ్యకృష్ణ గారిది ఎంత ముఖ్యమైన పాత్రో అర్థం చేసుకోవడానికి. లైగర్ సినిమాకి “రమ్యకృష్ణ” గారు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే… కోటి రూపాయలు.
#5. రోనిత్ రాయ్ – 1.5 crores
లైగర్ సినిమాలో నటించినందుకు “రోనిత్ రాయ్” అందుకున్న రెమ్యూనరేషన్ 1.5 కోట్లు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఆగస్ట్ 25 న ప్యాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందో లేదో? నిజంగానే ఈ సినిమాలో అంత గొప్ప విషయం ఏంటి అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
End of Article