Ads
సమంతలో సడన్ గా ఈ మార్పు ఏంటని ఆశ్చర్య పోతున్నారు సినీ జనాలు. తెలుగు , తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతుంది సమంత. ఈ అచ్చ తమిళ అమ్మాయి ఏ మాయ చేసావే చిత్రం తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ చిత్ర సక్సెస్ తో ఆమెకు నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.
Video Advertisement
టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన సమంత మెరిసింది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. విభిన్న కథలను ఎంచుకొనే సామ్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతోంది.
తాజాగా సమంత తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను ఆలోచనకి గురిచేసింది. ముందు నుంచి గ్లామర్ విషయంలో పాజిటివ్ గానే ఉన్న సమంత ఇకపై అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా సామాజిక మాధ్యమాల నుంచి కూడా విరామం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ వార్త తో సామ్ అభిమానులు కలవర పడుతున్నారు. సమంతకు ఏమైంది అని వారు చర్చించుకుంటున్నారు.
సమంత బోల్డ్ పాత్రల్లో నటించడానికి ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. తమిళం లో వచ్చిన సూపర్ డీలక్స్ చిత్రంలో అటువంటి పాత్రలో నటించిన సామ్, ఫామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో కూడా అటువంటి పాత్రనే పోషించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత పాపులారిటీ బాగా పెరిగిపోయింది. సమంత ఫామిలీ మాన్ లో చేసిన పాత్ర కారణంగానే తన భర్త తో విడాకులు అయ్యాయని ప్రచారం లో ఉంది. ఆ తర్వాత పుష్ప చిత్రం లో చేసిన ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మామా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సామ్.
ఇకపై కొత్త చిత్రాల్లో గ్లామరస్‌గా నటించేది లేదని, అలాగే సామాజిక మాధ్యమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు టాక్. హీరోలతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించనని, అరకొర దుస్తులు ధరించేది లేదని దర్శకులకు కొత్త షరతులను విధిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంగా చెబుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది సమంత స్పందిస్తేనే తెలుస్తుంది.
End of Article