Ads
భారత్ క్రికెట్ అభిమానుల్లో ఆశలు పెంచేలా ఉత్కంఠతో జరిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో 1 వికెట్ తేడాతో పాకిస్థాన్ గెలిచింది. దాంతో పాకిస్తాన్-శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ రెండు జట్లు కూడా రెండు విజయాలు సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 130 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ దక్కించుకున్న షాదాబ్ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇఫ్తికార్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేశారు. జట్టు స్కోర్ 97 పరుగుల దగ్గర ఉన్నప్పుడు షాదాబ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ గెలిచేందుకు చివరి ఓవర్లో ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా ఫారూఖి వేసిన మొదటి రెండు బంతులపై సిక్సర్లు కొట్టిన నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్స్‌లు) పాకిస్తాన్ జట్టుని గెలిపించారు.
ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్కోర్ చేసింది. ఇబ్రహీమ్ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, ఓపెనర్ హజ్రతుల్లా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు), చివరిలో రషీద్ ఖాన్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చేశారు. పాకిస్తాన్ జట్టు బౌలర్లలో రవూఫ్ రెండు వికెట్లు, నసీమ్ షా ఒక వికెట్, హస్‌నైన్ ఒక వికెట్, నవాజ్ ఒక వికెట్, షాదాబ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article