Ads
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఒక్క వార్తా బయటకు రాలేదు. దీంతో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశాము గురించి చర్చించుకుంటున్నారు.
Video Advertisement
తాజాగా ఒక యంగ్ క్రియేటివ్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య తనయుడైనప్పటికీ ఒక ప్రేమ కథ చిత్రానికి ఓకే చెప్పారని సమాచారం. ఇప్పటికే ఆదిత్య 369 సీక్వెల్ అని, బోయపాటి దర్శకత్వం లో మాస్ ఎంటర్టైనర్ అని, క్రిష్ తో సినిమా అని అనేక పుకార్లు వచ్చాయి.
అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న ప్రస్తుత సమాచారం మేరకు.. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరి తొలి సినిమాగా తను ఎలాంటి సినిమా చేస్తారనే దానిపై కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే బాలయ్య.. కొడుకుని ఓ లవ్‌స్టోరితో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. దీనికి ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల దర్శకుడైన రాహుల్ సాంకృత్యాన్ మోక్షజ్ఞ ను లాంచ్ చేయబోతున్నారట.
మరోవైపు మోక్షజ్ఞకి సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు కూడా బయటకొచ్చాయి. ఆయనకు బిజినెస్ పై ఆసక్తి ఉందని, యాక్టింగ్‌పై లేదని వార్తలు లీక్ అయ్యాయి. కానీ బాలయ్య బలవంతంగా కొడుకుని మోటివేట్ చేస్తున్నారని, అందుకే సినిమా ఎంట్రీకి ఆలస్యమవుతుందని అంటున్నారు. దీనికితోడు మోక్షజ్ఞ కూడా లావుగా కనిపిస్తుండటం, హీరో అయ్యే ఆసక్తి ఆయనలో కనిపించకపోవడం తో నందమూరి అభిమానులు కలవర పడుతున్నారు.
తాజాగా మోక్షజ్ఞ ఆయన పుట్టిన రోజు జరిగింది. `ఎన్బీకే107` సెట్(టర్కీ)లో యూనిట్ సమక్షంలో కేక్ కట్ చేశారు మోక్షజ్ఞ. అందులోనూ ఆయన లావుగా, ఏమాత్రం బాడీ ఫిట్ గా లేకపోవడం గమనార్హం.
End of Article