Ads
ఈగ మూవీలో స్టైలిష్ విలన్ గా ఫేమస్ అయిన కిచ్చా సుదీప్ మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇతను ఇతర భాషల్లో విలన్ గా బాగా బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఇతను నటించిన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘విక్రాంత్ రోణా’.
Video Advertisement
ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహించగా షాలినీ మంజునాథ్ దీనిని నిర్మించారు. అజనీశ్ లోకనాథ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు. జులై 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ ఆయిన ఈ సినిమా ఈ సంవత్సరం కన్నడ సినిమా నుండి వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెల 16 నుంచి ఈ విక్రాంత్ రోనా యొక్క తెలుగు, తమిళం మరియు హిందీ వెర్షన్స్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి క్రిటిక్ రివ్యూ నెగటివ్ గా వచ్చినప్పటికీ, స్టోరీ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇండియా టుడే మరియు ది టైమ్స్ నివేదిక ప్రకారం రూ. 95 కోట్ల బడ్జెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతున్న సందర్భం లో ఒక ట్రైలర్ ను వదిలారు.
హాలీవుడ్ థ్రిల్లర్ లాగా సాగే ఈ ప్రోమో చాలా ఆకర్షణీయంగా ఉంది .పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ నటించిన ఈ సినిమాలో జాక్విలిన్ .. నీతా అశోక్ .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది వేచి చూడాలి.
End of Article