Ads
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘యశోద’. పాన్-ఇండియన్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేస్తున్నారు.
Video Advertisement
ఛాలెంజింగ్ పాత్రలను ఎన్నుకొనే సామ్ ఇందులో ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. కాబోయే అమ్మగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సామ్‌కు డాక్టర్ చెబుతూ ఉంటుంది. కానీ ఆమె అందుకు రివర్స్‌లోనే పనులు చేస్తుంటుంది. అలా చేయటానికి కారణాలేంటి? ఆమె చుట్టూ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేదే ఈ సినిమా అని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెరపై గర్భిణులుగా నటించి మనల్ని మెప్పించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం..
#1 సౌందర్య – 9 నెలలు
చియాన్ విక్రమ్, సౌందర్య జంట గా నటించిన ఈ చిత్రం లో సౌందర్య గర్భవతిగా నటించారు.
#2 సమంత – యశోద
త్వరలో విడుదల కానున్న ‘యశోద’ చిత్రం లో సమంత గర్భవతిగా కనిపించనున్నట్లు టీజర్ ని చూస్తే అర్థం అవుతోంది. ఇంతకు ముందు విజయ్ తో నటించిన ‘పోలీసోడు’ చిత్రం లో కూడా సమంత గర్భవతిగా కనిపించారు.
#3 అనుష్క శెట్టి – బాహుబలి
‘బాహుబలి’ చిత్రంలో అనుష్క గర్భవతిగా నటించారు.
#4 కీర్తి సురేష్ – పెంగ్విన్ , రంగ్ దే
నితిన్ తో నటించిన ‘రంగ్ దే’, తమిళం లో వచ్చిన ‘పెంగ్విన్’ చిత్రాల్లో కీర్తి గర్భవతిగా కనిపించారు
#5 సాయి పల్లవి – పావ కథాగల్
నెట్ ఫ్లిక్ లో విడుదలైన ‘పావై కధాగల్’ చిత్రంలో సాయిపల్లవి గర్భవతిగా నటించారు
#6 నిత్యా మీనన్ – అదిరింది
దళపతి విజయ్ తో నిత్యా మీనన్ చేసిన ‘అదిరింది’ చిత్రంలో ఆమె గర్భవతిగా కనిపించారు
#7 విద్యా బాలన్ – కహాని
విద్యాబాలన్ కెరీర్లో సూపర్ హిట్ మూవీ గా నిలిచినా ‘కహాని’ చిత్రంలో ఆమె నిండు గర్భిణిగా నటించారు
#8 కృతి సనన్ – మిమి
వన్ నేనొక్కడినే చిత్ర హీరోయిన్ కృతి సనన్ ‘మిమి’ అనే చిత్రంలో సరోగేట్ మదర్ గా కనిపించారు.
#9 కరీనా కపూర్, కియారా అద్వానీ – గుడ్ న్యూస్
అక్షయ్ కుమార్ , కరీనా, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గుడ్ న్యూస్’ చిత్రంలో వీళ్లిద్దరు గర్భవతులుగా నటించారు.
#10 ప్రియాంక చోప్రా – మేరీ కోమ్
మేరీ కోమ్ బయో పిక్ లో నటించిన ప్రియాంక అందులో గర్భవతిగా కనిపించారు
#11 అనసూయ – థాంక్ యు బ్రదర్
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్ యు బ్రదర్’ చిత్రంలో ఆమె గర్భవతిగా కనిపించారు.
End of Article