Ads
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కిసి కా భాయ్.. కిసీ కా జాన్’ చిత్రం. ఇది తమిళంలో అజిత్ చేసిన చిత్రం ‘వీరం’కు రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ గా రీమేక్ చేశారు.
Video Advertisement
తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటనను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
వివరాల్లోకి వెళితే..ఈ సినిమాకు బచ్చన్ పాండేకు దర్శకత్వం వహించిన ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్కు నలుగురు సోదరులు ఉంటారు. వారిలో ఇద్దరి పాత్రలకు ఉత్తరాదిలో మంచి పాపులారిటీ ఉన్న సోషల్ మీడియా స్టార్స్.. సుల్, అబ్దుల్ రోజిక్ లను ఎంచుకున్నారు.. దీంతో ఈ సినిమాకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది.
ఈ సినిమా ద్వారా విక్టరీ వెంకటేష్ మరోసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. గతంలో యమలీల, చంటీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ, జెస్సీ గిల్ తదితరులు నటిస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్నది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు.
ఈ సినిమాకు తొలుత ‘కబీ ఈద్.. కభీ దీవాళీ’ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పేరును మార్చి ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ అనే పేరును తాజాగా ఖరారు చేసి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిత్రం డిసెంబర్ 30, 2022 తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..
End of Article