Ads
‘సీతా రామం’ సాధారణ చిత్రంగా ఏ అంచనాలు లేకుండా విడుదలైందీ అద్భుతం. మంచి కథని ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించిన హను రాఘవపూడిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Video Advertisement
‘పరుచూరి పాఠాలు’ పేరుతో పరుచూరి గోపాలకృష్ణ యు ట్యూబ్ వీడియోల ద్వారా కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన ‘సీతా రామం ‘ చిత్రంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
హృద్యమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం తననూ ఆకట్టుకుందని పరుచూరి తెలిపారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల మదిలో అలజడి రేపిన అంశాలు, చిత్ర ముగింపు సన్నివేశాలు ఈ సినిమాను మరపురాని చిత్రంగా నిలబెట్టాయన్నారు పరుచూరి.
గతంలో ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. కానీ సగటు ప్రేక్షకుడు కోరుకొనేలా సినిమాకు సుఖాంతం ఇవ్వకుండా, దర్శకుడు సినిమాను విషాదాంతంగా ముగించడంతో ‘సీతారామం’ భిన్నమైన ప్రేమ కథగా నిలిచిందని ఆయన తెలిపారు. అయితే క్లైమాక్స్ లో సీత, రామ్ కలిసినట్టు తీసుంటే ఈ చిత్రం వేరే లెవెల్లో ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మంచి కథను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సఫలీకృతుడయ్యాడని ఆయన తెలిపారు. కథకు, పాత్రలకు తగ్గట్టు నటీనటుల ఎంపిక కూడా బాగా కుదిరిందన్నారు పరుచూరి. ప్రధాన పాత్రల్లో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ బాగా నటించారని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించిన ‘వైజయంతి మూవీస్’ మేకర్స్ అశ్వనీదత్, ఆయన కుమార్తెలను పరుచూరి గోపాల కృష్ణ అభినందించారు.
ఇంతకాలం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ‘ అమెజాన్ ప్రైమ్’ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ట్రెండింగ్లో ఉంది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్లు వాసులు చేసిందని విశ్లేషకులు అంచనా వేశారు.
End of Article