Ads
ఒక వ్యక్తికి నష్టం మరొక వ్యక్తికి లాభం అనే సామెత మన టాలీవుడ్ హీరోలకు బాగా అచ్చి వచ్చింది. పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ అని పిలుస్తారు. అతని ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
Video Advertisement
అయితే ఈ భీమ్లా నాయక్ ఆఫర్ ముందు బాలకృష్ణ కు వెళ్ళింది అన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాదండోయ్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ నటన జీవితంలో బాలకృష్ణ మొదట వద్దు అన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఏమిటో చూద్దామా….
#1 భీమ్లా నాయక్
మొదట నాగ వంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ ప్రాజెక్ట్ కు బాలకృష్ణను అప్రోచ్ అయ్యారు. కానీ బాలయ్య కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను తిరస్కరించారు. తరువాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ పాత్రకు ఒప్పించారు.
#2 వకీల్ సాబ్
దానికి ముందు వకీల్ సాబ్ చిత్రం కోసం బాలకృష్ణను త్రివిక్రమ్ అప్రోచ్ అవ్వగా ఆ పాత్ర తన క్యారెక్టర్ కి సూట్ కాదు అని బాలయ్య స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో అర్థం కాని త్రివిక్రమ్ కు దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ పేరును సిఫార్సు చేశారు.
#3 అన్నవరం
అంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం చిత్రం కూడా మొదట బాలయ్య బాబు ఖాతాలోకి వెళ్లాల్సిందే. కానీ అప్పటికే ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్న బాలయ్య ఈ చిత్రం చేయలేరని చెప్పడంతో అది పవన్ కళ్యాణ్ కు దక్కింది.
#4 హరిహర వీరమల్లు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కూడా బాలయ్య బాబు మొదట నో చెప్పారని తరువాత పవన్ కళ్యాణ్ ను అప్రోచ్ అవడం జరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అంతే కాదండి రాజశేఖర్ సింహరాశి, విక్టరీ వెంకటేష్ నాగవల్లి కూడా బాలయ్య బాబు మొదట వద్దన్న చిత్రాలేనట.
పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో చాలా సినిమాలు తిరస్కరించారు. రవితేజ హిట్ అందుకున్న ఇడియట్ ,అమ్మానాన్న తెలుగు అమ్మాయి చిత్రాలు పవన్ కళ్యాణ్ తిరస్కరించినవే. ఓ విధంగా చూస్తే ఒక హీరో వద్దన్న సినిమాతో ఇంకో హీరో సక్సెస్ అందుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయం.
End of Article