Ads
సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిస్తే సోమవారం నాడు ఆయనకు అంత్యక్రియలు చేయనున్నారు. తన సోదరుడి కుమారుడు ప్రభాస్ తనకు వారసుడు అని కృష్ణం రాజు గతం లో ప్రకటించారు.
Video Advertisement
కృష్ణం రాజుకి ముగ్గురు కుమార్తెలు కావడంతో తన సోదరుడి కుమారుల్లో ఒకరు ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టడం లేదు. ప్రభాస్ కి ఉపనయనం జరగలేదు కాబట్టి అంత్యక్రియలు చేసే అవకాశం ఆయనకు లేనట్టే.
కృష్ణంరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సంప్రదాయం ప్రకారం ఉపనయనం జరిగితేనే వారు తలకొరివి పెట్టడానికి అర్హులవుతారట. అందుకే ఈ అంత్యక్రియలు ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ చేతుల మీదుగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక కుటుంబంలో ప్రభాస్ కంటే పెద్ద వ్యక్తి ఆయనే కావడంతో ఆయన చేతుల మీద గానే తలకొరివి పెట్టే కార్యక్రమం జరగనుంది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఒకరు కంటే ఎక్కువ మంది కుమారులు ఉంటే వారిలో పెద్ద కుమారుడు తండ్రికి తలకొరివి పెట్టేందుకు అర్హులు. అలాగే అందరికంటే చిన్నోడు తల్లికి తలకొల్లు పెట్టేందుకు అర్హులు అవుతారు. ఈ నేపథ్యంలోనే తలకొరివి పెట్టేందుకు ప్రభాస్ దూరంగా ఉన్నారు. ఆయన బదులు ఆయన సోదరుడు ప్రబోద్ తలకొరివి పెట్టనున్నారు.
ఇక ప్రబోద్ పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన ప్రభాస్ స్నేహితులకు చెందిన యువి క్రియేషన్స్ సంస్థకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్ లోని కృష్ణం రాజు ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు కుటుంబం ఒక ఇల్లు కూడా నిర్మిస్తోంది. ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా నివాసాన్ని కూడా అక్కడికి మార్చాలని అనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడం విషాదం.
End of Article