Ads
టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ సినిమా ‘ఒకే ఒక జీవితం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. తాను ఎంపిక చేసుకొనే కథలు, నటన తో ప్రేక్షకులను ఆకట్టుకొనే శర్వా..తన గత ఆరు సినిమాలతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచారు.
Video Advertisement
తాజాగా నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో చేసిన ‘ ఒకే ఒక జీవితం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాలో కొన్ని మైనస్ లు ఉండటం వల్ల సూపర్ హిట్ టాక్ ను మిస్ చేసుకుంది.
ఇప్పుడు ఆ మైనస్ పాయింట్లు ఏంటో చూద్దాం..
#1 టైం ట్రావెల్ కథాంశంతో కూడుకున్న సినిమాలకు జనాదరణ ఎప్పుడూ ఉంటుందని ఇటీవల వచ్చిన ‘బింబిసార’ ప్రూవ్ చేసింది. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి.. అక్కడక్కడా తప్పులు ఉన్నా పాస్ మార్కులు వేయించుకుంది. కానీ ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం మైనస్ అయ్యింది
#2 హీరో శర్వానంద్ ఈ చిత్రంలో చాలా డల్ గా కనిపించాడు. సినిమా మొదలైన గంట వరకు శర్వా నుంచి అసలు ఎక్స్ప్రెషన్సే పలకవు. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టరైజేషన్ వల్ల శర్వా తన ట్యాలెంట్ ని ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. పైగా పక్కన వెన్నెల కిషోర్, ప్రియదర్శి వంటి పోటీ ఇచ్చే నటీనటులు ఉండడం వల్ల శర్వా మార్క్ యాక్టింగ్ ఇందులో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
#3 ఇందులో హీరో మ్యూజిక్ టీచరయ్యుండీ సరైన పాటలు లేకపోవడం ఒక మైనస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిలో యావరేజ్. ఇలాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టు. యావరేజ్ కథనాన్ని కూడా ఎమోషనల్ గా చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగేది అదే. కానీ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేదు.
#4 సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ ఇక్కడ దర్శకుడు 1998 కి బదులు 1978 కి తీసుకెళ్లాడు అనే విమర్శలు వినిపించాయి. కొన్ని చోట్ల నిర్మాణ విలువలు మరీ పూర్ గా ఉన్నాయి
మొత్తంగా ఎంత హిట్ సినిమాకి అయినా మైనస్ లు లేకుండా అయితే ఉండవు కదా. ‘ఒకే ఒక జీవితం’ విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు జరిగాయి. కానీ ఎమోషనల్ గా జనాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి.. రెగ్యులర్ సినిమా లవర్స్ ను ఆ తప్పులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ పై తప్పుల విషయంలో కనుక దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను రాబట్టుకునేది.
End of Article