Ads
విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. లైగర్ సినిమా విడుదలవ్వక ముందే తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ను విజయ్ తో చేయనున్నట్లు పూరి ప్రకటించాడు. లైగర్ బ్లాక్ బస్టర్ అవుతుందని, తర్వాత ఈ సినిమాను భారీగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేసుకున్నారు.
Video Advertisement
దానికి సంబంధించిన చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు లైగర్ పరాజయంతో ఈ చిత్ర పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా విజయ్ దేవరకొండ ఈ చిత్రం పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇటీవల జరిగిన సైమా వేడుకలకు విజయ్ హాజరయ్యాడు. అక్కడ మీడియా జనగణమన గురించి అతడ్ని ప్రశ్నించగా ” ఇక్కడికి అందరూ ఈ ఈవెంట్ ను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోండి. సైమా ను ఎంజాయ్ చెయ్యండి” అంటూ బదులిచ్చాడు విజయ్.
దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఆరేళ్ళ క్రితమే పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు ఈ కథతో మహేష్ బాబు ని సంప్రదించారు. అయితే కొన్ని కారణాలతో మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ లాంటి ఉద్ధండులతో పాన్ ఇండియా లెవల్‌లో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇదంతా కాకుండా విజయ్ పేరు తెరమీదకు వచ్చింది.
అనంతరం పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ జంటగా షూటింగ్ ప్రారంభం అయ్యిందని వార్తలొచ్చాయి. ఇంతలో లైగర్ పరాజయంతో ఈ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు ‘జనగణమన’ విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేద్దామని విజయ్-పూరి ట్రై చేస్తున్నట్లు కూడా వార్తలోస్తున్నాయి. స్క్రిప్ట్ విషయం లో అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం..అనవసరంగా సినిమాపై ఖర్చు పెట్టకుండా.. బడ్జెట్ను నియత్రించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేరే అప్డేట్ లేనట్టే..
End of Article