Ads
బుల్లితెరలో అడుగుపెట్టి ఎంతో క్రేజ్ ని అందుకున్న హైపర్ ఆది. తనదైన స్టైల్ లో పంచ్ లు పేలుస్తూ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో గొప్ప ఇమేజ్ ని పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం హైపర్ ఆదిపై నెట్టింట ట్రోలింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆ ట్రోలింగ్ కి కారణం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను బాధ పెట్టడమే.
Video Advertisement
ఆది కూడా పవన్ స్టార్ కి పెద్ద ఫ్యాన్.. ఆయన వాళ్ళ అభిమానుల్ని ఎందుకు బాధ పెడతారు అని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆది మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడ్డారు.
లేటెస్ట్ గా ఒక షోలో ఆది మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన పాట విన్నా.. ఆయన మాట విన్నా.. నాకు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన సాంగ్ వింటే అరుపులు తెలియకుండానే, తెలియకుండానే చేతికి చప్పట్లు, తెలియకుండానే వేళ్ళకి విజిల్స్ వస్తూ ఉంటాయి. ఇక నాకు తెలిసి ఇప్పటి హీరోల్లో ఆ రేంజ్ లోకి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే పక్కాగా అది కిరణ్ అబ్బవరం అంటూ ఆది మాట్లాడారు. దీంతో పవన్ ఫాన్స్ హైపర్ ఆది తో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేసారు. ఒక సినిమా ఈవెంట్‌లో యువ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ చాలా రిలాక్స్‌డ్‌గా, స్టైలిష్‌గా సీట్లలో కూర్చున్నారు.మరో ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ పద్దతిగా, వినయంగా కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు. బండ్ల గణేశ్ ఈ రెండు ఫొటోలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ స్టార్‌గా కొనసాగుతున్నప్పటికీ సింప్లిసిటీ, పెద్దల పట్ల గౌరవంగా మెదులుతుంటారు..అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. వీళ్ళే కాకుండా హీరోలు విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ పై కూడా నెగటివిటీ బాగా పెరిగిపోయింది.
తమ దైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యంగ్ హీరోలపై ఎందుకింత నెగటివిటీ అని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పరిశ్రమలో కొత్త హీరోలు రావడం సాధారణమే.. కానీ తమని తాము నిరూపించుకొని.. ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నవారే ఇండస్ట్రీలో నిలబడగలరు. అన్నిటికి ట్రోల్ చేస్తూ.. సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీ చేయడం మంచిది కాదు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
End of Article