రోజా కూతురు సినీ ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా..??హీరో ఎవరంటే..?

రోజా కూతురు సినీ ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా..??హీరో ఎవరంటే..?

by Anudeep

Ads

సినీ, రాజకీయ రంగాల్లో తనదైన పాత్రను పోషిస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Video Advertisement

రాజకీయాల్లోకి రాకముందు రోజా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరితో రోజా కలిసి నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించిన రోజా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారామె. వీరికి కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.

roja daughter entering into film industry
రోజా వారసురాలు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయగా నిరూపించుకుంటున్నారు. రైటర్‌, ప్రోగ్రామర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటుతున్నారు. సమాజంలో ఓ లక్ష్యంతో పనిచేస్తున్న యువతకు ఇచ్చే “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు ఆమెకు దక్కింది. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా అన్షు మాలిక ఫొటో వేయడం గమనార్హం.

roja daughter entering into film industry
ఈ నేపథ్యం లో అన్షు సినీ రంగ ప్రవేశానికి రోజా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అన్షు ఇటీవలే అమెరికాలోని ఫేమస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో సీటును సంపాదించింది. దీంతో ఒక స్టార్ హీరో కొడుకుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ విక్రమ్.

roja daughter entering into film industry
తన కొడుకు కోసం విక్రమ్ కూడా ఒక మంచి కథ కోసం వెతుకుతున్నాడట. ఆ సినిమాలో ధ్రువ విక్రమ్ సరసన అన్షు మాలికకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వార్త విన్న అభిమానులు అన్షు హీరోయిన్ గా రాణిస్తుందనే ఆశిస్తున్నారు.
అన్షు ఇప్పటికే ఒక పుస్తకాన్ని రాసి ప్రచురించారు. మరోవైపు అన్షు మాలిక తల్లిని మించి సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంత చిన్న వయసులోనే ఐదు మంది చిన్నారులను దత్తత తీసుకొని వారి చదువు బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నారు.

roja daughter entering into film industry
ఇవే కాకుండా స్మైల్ 100 అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే 100 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ఉన్నత చదువుల కోసం అన్షు మాలిక ఎంతో కృషి చేస్తున్నారు.


End of Article

You may also like