Krishna Vrinda Vihari Review : “నాగ శౌర్య” ఖాతాలో మరో పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Krishna Vrinda Vihari Review : “నాగ శౌర్య” ఖాతాలో మరో పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

  • చిత్రం : కృష్ణ వ్రింద విహారి
  • నటీనటులు : నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధిక శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య అక్కల, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ
  • తదితరులు
  • నిర్మాత : నాగశౌర్య (ఐరా క్రియేషన్స్)
  • దర్శకత్వం : అనీష్
  • సంగీతం : సాగర్ మహతి
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022

krishna vrinda vihari review

Video Advertisement

స్టోరీ :

కృష్ణ (నాగ శౌర్య) ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అబ్బాయి. కృష్ణకి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అక్కడ వ్రింద (షిర్లే సెటియా) తో ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అసలు సమస్య వస్తుంది. అసలు ఇద్దరి కుటుంబ వ్యవహారాలు చాలా వేరుగా ఉంటాయి. కృష్ణ తన కుటుంబాన్ని ఎలా ఒప్పించగలిగాడు? వ్రింద వారికి నచ్చిందా? వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చివరికి వాళ్ళు కలిసారా? ఇదంతా తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

krishna vrinda vihari review

రివ్యూ :

డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటారు అని నాగ శౌర్యకి చాలా మంచి పేరు ఉంది. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ఒక డిఫరెంట్ రోల్ చేశారు. కథ అంత కొత్తగా ఏమీ అనిపించదు. ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అబ్బాయి, ఇందుకు భిన్నంగా ఉన్న అమ్మాయి ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను మనం చాలానే చూశాం. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందినదే.

krishna vrinda vihari review

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ శౌర్య తన పాత్ర వరకు బానే చేశారు. హీరోయిన్ షిర్లే సెటియా మొదటి సినిమా అయినా కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. మిగిలిన అందరూ తమ పాత్రల వరకు బానే చేశారు. సీనియర్ నటి రాధిక మాత్రం హైలైట్ గా నిలిచారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా అది రాసుకునే విధానం ఇంకొంచెం మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎమోషన్స్ తెరపై అంత బాగా కనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే ఏదో హడావిడిలో తీసారు ఏమో అనిపిస్తుంది. అలాగే పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • సినిమాటోగ్రఫీ
  • కామెడీ
  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

  • కథలో లోపించిన కొత్తదనం
  • బలహీనమైన ఎమోషన్స్
  • రాసుకున్న విధానం
  • ఆఫీస్ సీన్స్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

కథలో కొత్తదనం లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏదో ఒక సినిమా చూద్దాం అని అనుకునే వారికి కృష్ణ వ్రింద విహారి ఒక్క సారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

Trailer:


End of Article

You may also like