Ads
టాలీవుడ్ లో రియల్ స్టార్ శ్రీహరికి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసాడు ఆయన. ఆయన సతీమణి డిస్కో శాంతి కూడా వందల సినిమాల్లో నటించారు.
Video Advertisement
శ్రీహరి నటించిన దేవా, సాంబయ్య, పోలీస్, భద్రాచలం వంటి సినిమాలతో తిరుగులేని విజయాలు సాధించారు. రియల్ స్టార్ ఇమేజ్ తో ఆయనకు మంచి ఆఫర్ లే వచ్చాయి. అలాగే సహాయ నటుడిగా కూడా అనేక చిత్రాల్లో నటించాడు.పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు శ్రీహరి.
ఆయన 1996 లో డిస్కో శాంతిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సౌత్ ఇండియా లో ఆమె టాప్ ఆర్టిస్ట్. ఐటెం సాంగ్స్ అంటే ఆమె పేరు ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. స్టార్ కపుల్ గా వీళ్ళకు చాలా మంచి ఇమేజ్ ఉంది.
ఆయన చనిపోయి ఇప్పటికీ దాదాపు 9 ఏళ్ళు కావస్తున్నా కూడా ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు విషయాలు పంచుకున్నారు.
శ్రీహరి మరణం ఒక్కసారిగా ఆయన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేసింది.తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా డిస్కో శాంతి మాట్లాడుతూ.. నా భర్త శ్రీహరి చనిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. “మాకు రెమ్యునరేషన్స్ కరెక్ట్‌గా వచ్చుంటే నేను మరో 10 ఇళ్లు కొని ఉండేదాన్ని. బావ (శ్రీహరి) చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ఇంటిపై అప్పులుంటే నగలన్నీ అమ్మేసి తీర్చేశాను. అలాగే కార్లంటినీ అమ్మేశాను. చిరంజీవిగారి సంస్థ సహా మరో రెండు, మూడు సంస్థలే శ్రీహరిగారికి రెమ్యునరేషన్‌ను కరెక్ట్‌గా ఇచ్చారు. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. మా పెద్ద అబ్బాయి హీరో గా చేసినా కూడా కష్టాలు తీరలేదు.
అయితే బావకి సినిమా అంటే పిచ్చి. డబ్బులు ఇవ్వకపోయినా సినిమాలు చేయమని చెప్పేదాన్ని. 40-50 ఏళ్లు వచ్చినా తండ్రిగానో, అన్నగానో ఏదో ఒక వేషం వస్తుందిలే.. ఆయన కూడా చేస్తారనే ఉద్దేశంతో నేను కూడా ఎప్పుడు వద్దని చెప్పలేదు.”
మధ్యలో ఓసారి బాలకృష్ణగారు ఫోన్ చేశారు. ఆయనకలా ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలో, బావ ఏదో ఒక క్యారెక్టర్ చేశారట. దాని కోసం బాలకృష్ణగారు ఫోన్ చేసి ‘శాంతిగారు ఇలా శ్రీహరిగారు మా సినిమాలో ఓ క్యారెక్టర్ చేశారు. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా!. ఏమైనా సాయం కావాలా’ అని అడిగారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేయలేదు’’ అన్నారు శాంతి శ్రీహరి.
కోట్లు సంపాదించినా సరే అనేక సేవా కార్యక్రమాలతో శ్రీహరి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు తమ కుటుంబం చెన్నై లో నివాసం ఉంటుందని డిస్కో శాంతి పేర్కొన్నారు.
End of Article