ఈ నలుగురు జబర్దస్త్ జడ్జి ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

ఈ నలుగురు జబర్దస్త్ జడ్జి ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

by Anudeep

Ads

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షోలలో జబర్దస్త్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతోమంది కెరియర్ కు పునాది వేసింది ఈ షో. ఇక సీనియర్ హీరోయిన్ రోజా లాంటి వాళ్ళు కూడా ఆర్థిక సమస్య లతో ఇబ్బంది పడుతున్న సమయంలో జబర్దస్త్ ఆమెను ఆదుకుంది.

Video Advertisement

కేవలం రోజా మాత్రమే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్న ధన్ రాజ్ , గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్ , చమ్మక్ చంద్ర, వేణు లాంటి వారు కూడా కేవలం జబర్దస్త్ ద్వారానే తమ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

jabardasth judges remunaration
ఇకపోతే 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు ఎంతోమంది జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి గత తొమ్మిది సంవత్సరాలు నుంచి రోజా, నాగబాబు నిరంతరాయంగా జడ్జిలుగా పనిచేశారు. కానీ పారితోషకం విషయంలో గొడవ రావడంతో నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారన్న విషయం తెల్సిందే.

#1 రోజా

jabardasth judges remunaration
సీనియర్ హీరోయిన్ గా, మంత్రిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రోజా కు సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఈమెకు మల్లెమాలవారు బాగానే పారితోషకాన్ని అందించారు. ఒక్కొక్క ఎపిసోడ్ కు రోజాకు సుమారుగా రూ.5 లక్షలు అందించారు. ఇక ఆ తర్వాత కాలంలో ఈమె పారితోషకం పెరిగిన విషయం తెలిసిందే. కానీ ఈమెకు ఇటీవల మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ జడ్జ్ స్థానానికి గుడ్ బై చెప్పింది.

#2 నాగబాబు

jabardasth judges remunaration
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు హీరోగా ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ.. హీరో కాలేకపోయారు. కానీ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక రోజాతో పాటు నాగబాబు కూడా జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించారు. కానీ ఇండస్ట్రీలో రోజా కంటే తక్కువ గుర్తింపు ఉన్న నాగబాబుకు కేవలం ఎపిసోడ్ కు రూ.3 లక్షలు మాత్రమే అందించేవారు.

#3 ఇంద్రజ

jabardasth judges remunaration
ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడ్ బాయ్ చెప్పిన ఇంద్రజ జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుంది.

#4 మనో

jabardasth judges remunaration
నాగబాబు స్థానంలో జడ్జి గా వచ్చిన ప్లేబ్యాక్ సింగర్ మనోకి ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు ఇచ్చారు.

#5 కృష్ణ భగవాన్

jabardasth judges remunaration
తాజాగా కృష్ణ భగవాన్ ఇంద్రజాతో కలిపి జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈయనకు ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇక మల్లెమాలవారు ఎప్పుడూ కూడా సినిమాలలో వీరికుండే ఇమేజ్ ను బట్టి పారితోషకం ఫిక్స్ చేస్తూ ఉంటారు.

Also Read: ఈ 10 మంది శాస్త్రవేత్తలు…వారు కనిపెట్టిన వాటివల్ల చనిపోయారని తెలుసా.? ఇంతకీ ఏం కనిపెట్టారు?


End of Article

You may also like