Ads
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. తన సినీ ప్రస్థానం లో 150 కి పైగా చిత్రాలు చేసారు చిరు. వాటిల్లో చాలా వరకు ఇండస్ట్రీ రికార్డు లే.
Video Advertisement
మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉన్న హీరోనో మనందరికీ తెలుసు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులకు అనేక అంచనాలు ఉంటాయి. దర్శక, నిర్మాతలకు అయితే ఆయన సినిమాతో లాభాల పంట పండుతుందనే ఒక పేరు ఉంది.
కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి భారీ అంచనాల నడుమ అనేక హంగులతో సినిమాలు వస్తూ ఉంటాయి.. దానిపై అభిమానులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.. కానీ సినిమా తీరా విడుదలయ్యాక మెప్పించలేక పోతుంది.. కానీ కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితిలో విడుదలవుతాయి. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి అంచనాలు దాటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తాయి.
అయితే రాజకీయాల్లో తన ప్రభావం చూపించాలనుకున్న చిరు తొమ్మిదేళ్ల విరామం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు. అయితే చిరు సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నంత సజావుగా సాగట్లేదు. క్రేజీ డైరెక్టర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా గానీ చిరుకు సరైన హిట్ పడట్లేదు. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం..
#1 ఖైదీ నెంబర్ 150
‘ఠాగూర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 20 ఏళ్ళకి చిరు తన కం బ్యాక్ సినిమాను వి వి వినాయక్ తో చేసారు. తమిళ చిత్రం ‘కత్తి’ కి రీమేక్ అయిన ఖైదీ నెంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. కానీ ఆ తర్వాత వినాయక్ కు గాని, చిరుకి గాని సరైన హిట్ దొరకలేదు.
#2 సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా. ఈ చిత్రంలో చిరంజీవి తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. ఇది హీరోగా చిరంజీవి తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేసారు. కానీ దర్శకుడిగా మంచి రికార్డ్ ఉన్న సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఫర్వాలేదు అనిపించినా..మిగతా భాషల్లో డిసాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి ఒక్క సినిమా కూడా తీయలేదు.
#3 ఆచార్య
సంచలన డైరెక్టర్ కొరటాల శివ సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.. ఆయన చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య మూవీ చేశారు. ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఆయన ఈ సినిమాతో బోల్తా పడ్డారు. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ చిత్రం అభిమానులను నిరాశ పరిచింది.
తన సినిమాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోయేసరికి చిరు మరోసారి రీమేక్ నే నమ్ముకున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ మూవీ ని ‘ గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేస్తున్నారు చిరు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
సినిమా ఫలితాలు ఎలా ఉన్నా చిరు మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకు పోతున్నారు. వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ గా ఉంటున్నారు మెగాస్టార్.
End of Article