గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ రెండు హిట్ అంటున్నారు… కానీ రెండిట్లో ఏది ఎక్కువ హిట్ అయ్యిందంటే.?

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ రెండు హిట్ అంటున్నారు… కానీ రెండిట్లో ఏది ఎక్కువ హిట్ అయ్యిందంటే.?

by Anudeep

Ads

టాలీవుడ్‌ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో సంక్రాంతి సీజన్‌లో తప్ప మిగిలిన రోజుల్లో గ్యాప్‌ ఇచ్చుకుంటూనే విడుదల చేస్తుంటారు. అయితే ఈ దసరాకు మాత్రం డిఫరెంట్‌గా జరిగింది. టాలీవుడ్‌ మిత్రులు చిరంజీవి, నాగార్జున ఒకే రోజు థియేటర్లలోకి వచ్చారు.

Video Advertisement

ఎందుకొచ్చారు, వాటి వెనుక ఉన్న లెక్కేంటి అనేది పక్కనపెడితే.. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేరోజుల రావడం ఫ్యాన్స్‌కి అయితే హ్యాపీ. ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఇచ్చారు . నాగార్జున నటించిన “ది ఘోస్ట్” సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు సినిమాలు పాజిటివ్ టాక్స్ తో దూసుకుపోతున్నాయి .

who won the movie battle in dasara festival..
అయితే ఏ సినిమా నిజమైన హిట్ కొట్టింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
# గాడ్ ఫాదర్

who won the movie battle in dasara festival..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్టర్ చేశాడు. నిజానికి ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా పేరు సంపాదించుకున్న “లూసీఫర్” కి రీమిక్స్ మొదటి నుంచి అదే ప్రచారం జరిగింది. అయితే తెరపై బొమ్మ పడగానే ఎవ్వరు ఈ సినిమాని రీమిక్స్ సినిమాగా భావించలేదు. అసలు ఆ పాయింట్ చెప్పకుండా ఉంటే బాగుండేది అంటూ జనాలు చెప్పుకొచ్చారు. ఎక్కడ లూసిఫర్ కి గాడ్ ఫాదర్ కి లింక్ లేకుండా ఫ్రెష్ కథను రాసుకొని మెగాస్టార్ చేత తనదైన స్టైల్ లో నటింపజేసి ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడేలా చేశాడు మోహన్ రాజా.

who won the movie battle in dasara festival..

సినిమాకి మెగాస్టార్ చిరంజీవి నటన ఎంత ప్లస్ అయిందో ..ఆయన నటనకి తమన్ మ్యూజిక్ అంత పెద్ద హిట్ అయింది . అంతేకాదు ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ వాళ్ళ పాత్రలో జీవించేసారు. నయనతార రోల్ చిన్నదైనప్పటికీ మెరిసిన కొంత సేపైనా సరే తన కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పలికించి మరోసారి తనలోని నటిని బయటకు తీసుకొచ్చింది. మోహన్ రాజా విలన్ గా ఎవరో నార్త్ హీరోని పెట్టకుండా తెలుగు హీరో సత్య దేవ్ ని పెట్టి మంచి పని చేశాడు అన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో చాలా సోషల్ మీడియా సైట్స్ , వెబ్ మీడియా గాట్ ఫాదర్ సినిమా కి 3, 3.25 రేటింగ్ ఇచ్చింది.
# ది ఘోస్ట్

who won the movie battle in dasara festival..
అక్కినేని నాగార్జున కెరియర్ లోనే ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా గా తెరకెక్కి.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇదివరకే గరుడవేగ సినిమాతో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న ప్రవీణ్ సత్తారు.. నాగార్జునతో కూడా అలాంటి రకమైన హిట్ ను అందుకున్నాడు. దీంతో ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ పేరు టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో యాడ్ అయిపోయింది.

who won the movie battle in dasara festival..
ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ సోనాల్ చౌహాన్ అందాలు. అంతేకాదు హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీన్స్ లో నటించి శభాష్ అనిపించుకుంది. అయితే నాగార్జున రొమాన్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా అది ఆయన ఫ్యాన్స్ కు ఎలాగో నచ్చుతుంది . అయితే సినిమాల్లో కామెడీ నిల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లే జనాలు అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు. యాక్షన్ ఎపిసోడ్స్ షాకింగ్ ట్విస్ట్ లు కావాలనుకున్న జనాలకు ఈ సినిమా బాగా బుర్రకెక్కుతుంది. అంతేకాదు వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో నాగార్జున ఘోస్ట్ సినిమాకు 2.5, 2.75 రేటింగ్ ఇచ్చారు.

minus points in god father..!!

నిజానికి ‘గాడ్ ఫాదర్’ రీమేక్ మూవీ, ఇప్పటికే చాలా మంది ఓటీటీ ల్లో చూసేసారు. కానీ ‘ ది ఘోస్ట్’ స్ట్రెయిట్ సినిమా కావడం దానికి ప్లస్ అవుతుందని భావించారు అందరూ. రెండు సినిమాలు హిట్ అయినా.. చిరు నటన, మోహన్ రాజా దర్శకత్వం, కథనం గాడ్ ఫాదర్ ని టాప్ లో నిలిపాయి. వెబ్ మీడియా ఆధారంగా బాక్సాఫీస్ వద్ద అసలైన హీరోగా నిలిచింది గాడ్ ఫాదర్ అనే చెప్పాలి.!!


End of Article

You may also like