Ads
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి వచ్చేశాడు, సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా కానుకగా సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దించగా సినిమా పై ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా హైప్ ఏర్పడింది.
Video Advertisement
అయితే గాడ్ ఫాదర్ సినిమాకు తొలి ఆట తోనేసూపర్ హిట్ టాక్ రావడంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మాతృకతో పోలిస్తే కథనం లో చాలా మార్పులు చేసారు దర్శకుడు మోహన్ రాజా. దీంతో మంచి హిట్ గా నిలిచింది గాడ్ ఫాదర్.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే సినిమాలో సర్వదామన్ బెనర్జీ గారు చిరు తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా నటించారు. ఆయన్ని తెరపై చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. 1987లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా మనందరికీ తెలుసు. ఆ సినిమాలో సుమలతకు భర్త పాత్రలో నటించారు సర్వదమన్ బెనర్జీ. మల్లి 35 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి నటించారు. సిరివెన్నెల చిత్రంతో సర్వదమన్ బెనర్జీ గారికి ఎంత పేరు లభించిందో కొత్తగా చెప్పక్కర్లేదు.
1986లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాఎథ్ తెరకెక్కించిన చిత్రం సిరివెన్నెల. ఆ సినిమాలో పాటలు రాసి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ సినిమాలో సుహాసిని, సర్వదమన్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది.
చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ఆ మార్పులు కూడా చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి.
అయితే ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ చాలా బాగుంది అని అంటున్నారు. అలానే ఈ సినిమాలో బీజీఎమ్ కూడా చాలా బాగుందంటూ అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ కూడా నటించి మెప్పించారు. దీంతో చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవికి హిట్ వచ్చింది అని ఫాన్స్ సంబరపడుతున్నారు.
End of Article