Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వరుస విజయలతో దూసుకుపోతోన్న మహేష్ కోసం ఈసారి గురూజీ ఓ డిఫరెంట్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్.
Video Advertisement
ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించట. అయితే ఇంతలోనే మహేష్ తల్లిగారు ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో రఫ్ గా కనిపించనున్నారు మహేష్. ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడట. ఇప్పటివరకు మహేష్ సాఫ్ట్ వేర్ గా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ పాత్ర కోసం మహేష్ లుక్ చేంజ్ చేశాడట. అంతే కాదు బరువు కూడా తగ్గాడట మహేష్. అంతే కాదు సిక్స్ ప్యాక్ ఉండేలా బాడీని డెవలప్ చేశాడట.
అయితే ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ కి సంబందించిన ఒక అప్డేట్ నెట్టింట వైరల్ వుతోంది. ఈ మూవీ లో హీరో ఒక పాత్ర ను కాపాడే ప్రయత్నాలు చేస్తారంట. ఈ పాత్ర సినిమాకే హైలెట్ కాబోతుంది అని సమాచారం. ఈ పాత్రకు మహేష్ కుమార్తెను తీసుకోవాలి అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారాల నేపథ్యం లో ఈ సినిమా స్టోరీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగి భాయిజాన్ ‘ లాగా ఉందేంటి అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఆ సినిమాలో ఒక పాప ముఖ్య పాత్రలో నటించింది. ఇప్పుడు అటువంటి పాత్రలోనే సితార నటించనున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఈ చిన్నారికి యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడని అంటున్నారు. ఆమె ఎంట్రీని సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేశారని టాక్. అంతేకాదు, మహేశ్ – సితార మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని చోట్ల ఫన్నీగా, కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం.
అయితే కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ఆయన పిల్లలు కూడా సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో సినీ ప్రేక్షకులని పలకరించగా, సితార కూడా సర్కారు వారి పాట ప్రమోషనల్ సాంగ్ కనిపించి లో మెరిపించింది. అంతే కాకుండా తండ్రితో కలిసి పలు యాడ్స్ లో కూడా నటించింది. అయితే త్రివిక్రమ్ తో తాను చేసే ఈ చిత్రం ద్వారానే మహేష్ తన కూతురు సితార ఘట్టమనేనిని సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.
మరోవైపు పదేండ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడం పట్ల సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
End of Article