“విలాసవంతమైన ఇల్లు” నుండి… ఇంటర్నేషనల్ రేంజ్ “వ్యానిటీ వ్యాన్‌” వరకు… “అల్లు అర్జున్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!

“విలాసవంతమైన ఇల్లు” నుండి… ఇంటర్నేషనల్ రేంజ్ “వ్యానిటీ వ్యాన్‌” వరకు… “అల్లు అర్జున్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!

by Anudeep

Ads

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన స్టైలీష్‌ లుక్‌, భిన్నమైన డ్యాన్స్‌, అంతకుమించిన వ్యక్తిత్వం.. ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉంటాడు బన్నీ. అందుకే స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ ఎదిగాడు.

Video Advertisement

ఇక బన్నీ ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్స్‌ ప్లాన్‌ చేస్తాడు. లేదా ఇంట్లోనే పిల్లలతో సరదా సమయాన్ని ఆస్వాదిస్తాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా భార్య పిల్లలతో హైదరాబాద్‌ రోడ్లపై కారులో షికారు కొడుతుంటాడు.

luxurious things owned by allu arjun

 

పుష్పతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న బన్నీపైనే ఇప్పుడు అందరి ఫోకస్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్ల కలెక్షన్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి అవేంటి? వాటి స్పెషాలిటీ ఏంటో మనం కూడా ఓ సారి చూద్దాం..

#1 వ్యానిటీ వ్యాన్‌ – 7 కోట్లు

look at the luxurious things owned by allu arjun
బెసిగ్గా బ్లాక్‌ను ఇష్టపడే ఈ ఐకాన్‌ స్టార్‌ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా చూసుకున్నాడు. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్‌ ధర రూ. 7 కోట్లు. ముద్దుగా దీనిని ఫాల్కన్‌ అని పిలుచుకుంటాడట బన్నీ. ఈ వ్యాన్‌లో భారీ టీవీ సెట్, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ అమర్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీనిపై ముందులో భాగంగా ఫాల్కోన్‌ అని రాసి ఉండగా.. ఇరువైపులా ఏఏ అని ఉంటుంది.

look at the luxurious things owned by allu arjun
#2 విలాసవంతమైన బంగ్లా – 100 కోట్లు

look at the luxurious things owned by allu arjun
హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు ‘బ్లెస్సింగ్’. రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా అల్లు అర్జున్ ఈ ఇంటిని తన టేస్ట్‌కు తగ్గట్టుగా నిర్మించుకున్నాడు.

look at the luxurious things owned by allu arjun

పూర్తిగా సహజమైన తెలుపు రంగుతో పెయింటింగ్‌ చేసిన ఈ ఇంటి లోపల పెద్ద స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, హోమ్‌ థియేటర్‌, స్పెషల్‌ పార్టీల కోసం బార్‌ జోన్‌, పిల్లల కోసం ప్లేయింగ్‌ ఏరియా ఉంది.

#3 రేంజ్ రోవర్ వోగ్ – కోటి రూపాయలు

look at the luxurious things owned by allu arjun
అల్లు అర్జున్‌ అత్యంత ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన లగ్జరీ కారు రేంజ్ రోవర్ వోగ్, బన్నీ విలువైన ఆస్తులలో ఇది కూడా ఒకటి. బన్నీ ఈ కారు ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఇంట్లో కొత్త కారు. నేను దానికి బీస్ట్‌ అని పేరు పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. ఈ రేంజ్‌ రోవర్‌ కారు ఖరీదు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా.

#4 హమ్మర్‌ హెచ్‌2 – 75 లక్షలు

look at the luxurious things owned by allu arjun
బన్నీ ఖరీదైన కారు కలెక్షన్స్‌లో ఇది ఒకటి. దీని ధర రూ. 75 లక్షలకు పైగా ఉంటుంది. దీనిని అల్లు అర్జున్‌ ఎంతో ఇష్టంగా తన తొలి సంపాదనతో కొనుగొలు చేశాడట. ఈ కారులోనే బన్నీ ఎక్కువగా భార్య, పిల్లలతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళుతుంటాడని సమాచారం.

#5 రెడ్‌ మెర్సిడేజ్‌ 200 సీడీఐ

look at the luxurious things owned by allu arjun
ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర 31 లక్షల రూపాయలు. ఎక్కువ బన్నీ ఈ కారులోనే ఫ్యామిలీతో కలిసి షికార్లకు వెళుతుంటాడట.

#6 రెస్టారెంట్

look at the luxurious things owned by allu arjun
బి డబ్స్ చైన్ అఫ్ రెస్టారెంట్స్ లో అల్లుఅర్జున్ భాగస్వామిగా ఉన్నారు. ఇది బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో అమెరికన్ చైన్ ఆఫ్ స్పోర్ట్స్ బార్‌తో కలిసి ఉంది.

#7 ఫిలిం స్టూడియో

look at the luxurious things owned by allu arjun
ఇటీవల అల్లు అర్జున్ తన సొంత ఫిలిం స్టూడియో ని ప్రారంభించారు. చిత్ర నిర్మాణం లో అల్లు ఫామిలీ ఎప్పటి నుంచో ఉంది. చిత్ర నిర్మాణం లో వారసత్వాన్ని కొనసాగించడానికి అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.

#8 జాగ్వార్ – 1.2 కోట్లు

look at the luxurious things owned by allu arjun
స్టైలిష్ స్టార్ అల్లు కూడా 1.2 కోట్ల రూపాయల విలువైన జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌ను కొనుక్కున్నాడు. ఈవెంట్లకు ఎక్కువగా ఈ కార్ లోనే వస్తారు బన్నీ.

#9 ప్రైవేట్ జెట్

luxurious things owned by allu arjun
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది. పలు సినిమాల ప్రమోషన్ లకు, వెకేషన్ లకు ఈ జెట్ లోనే వెళ్తారు అల్లు ఫామిలీ.


End of Article

You may also like